http://telugutaruni.weebly.com/2/post/2013/07/73.html
బాదుషాలు చేయడానికి కావలసిన పదార్థాలు మరియు తయారుచేసే పద్ధతి కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
http://telugutaruni.weebly.com/2/post/2013/07/73.html
0 Comments
![]() ఇరవైఏళ్లక్రితం ఓ తండా అంగన్వాడీ కేంద్రంలో ఆయాగా పనిచేసిన లక్ష్మి ఈ రోజు దేశ, విదేశాల్లో డిజైనర్వేర్ సేల్ చేస్తోంది. రంగారెడ్డి జిల్లా మంచ్యాల మండలం ఎల్లమ్మ తండాకు చెందిన లక్ష్మి విజయం వెనుక ఉన్న విశేషాలు ఆమె మాటల్లో... Read more
![]() సరిగ్గా పదిహేనేళ్ల క్రితం ఓ మధ్యాహ్నం... మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్కు అరవై కిలోమీటర్ల దూరంలోని విదిశ అనే చిన్న పట్టణంలో రైల్వే స్టేషన్ ప్లాట్ఫారంపై ఒంటరిగా కూర్చుని ఉంది ఆ పద్దెనిమిదేళ్ల అమ్మాయి. చేతిలో చిల్లిగవ్వ లేదు, రెండు జతల బట్టలు తప్ప వెంట వేరే లగేజి కూడా లేదు. కొన్ని నిమిషాల తర్వాత ఓ ట్రైన్ రాగానే అది ఎక్కడికి వెళ్తుందని కూడా చూడకుండా ఎక్కేసింది. అంతే! మళ్లీ ఇంటిముఖం చూడలేదు.. ఇప్పుడామె ముంబయిలోని ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్! పేరు వైశాలి షదన్గులే.
Read more.. ![]() విజయవాడలోని ఓ హాస్పిటల్‌లో కల్పనను చేర్పించారు. అదేపనిగా నొప్పులు వస్తున్నా, ప్రసవం మాత్రం కావటం లేదు. కల్పన భర్తా, తల్లీ ఒకటే కంగారుపడుతున్నారు. డాక్టర్లు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. సమయం మించిపోతోంది. 'బలవంతంగా ప్రసవం చేయక తప్పదు' అన్నారు డాక్టర్లు. 'ఆమెకు ఏం కాదు కదా?'... కల్పన భర్త.... 'నా కూతురికి ఏ ముప్పూ రాదు కదా?' - కల్పన తల్లి... వాళ్లిద్దరూ అడుగుతూనే ఉన్నారు. కాసేపటికి 'ఆడపిల్ల మహాలక్ష్మిలా ఉందే! అచ్చు గుద్దినట్లు నీపోలికలే' తల్లి గొంతు విన్న కల్పనకు అంత నీరసంలోనూ ఎంతో శక్తి వచ్చినట్లు అనిపించింది. మరికొన్ని క్షణాలకే డాక్టర్ పసికందును కల్పన చేతుల్లో ఉంచుతూ... 'క్షమించండి, ప్రసవం సమయంలో పాప నుదుటి నరాలు బాగా నొక్కుకు పోయాయి' అని చెప్పారు. మూడు రోజుల తరవాత 'పాప, శారీరక వైకల్యానికి గురిచేసే సెరిబ్రల్ పాల్సీ బారిన పడే అవకాశం ఉంది' అని మిగతా వైద్యులు చెప్పడంతో కల్పన మాట్లాడలేకపోయింది.
Read more ![]() నరకం నుంచి తప్పించుకున్నవారు ఏం చేస్తారు?
వెనక్కి తిరిగైనా చూడకుండా... ‘చాలు దేవుడా’ అని పారిపోతారు. జయమ్మ మాత్రం అలా చేయలేదు. నరకం నుంచి బయట పడగానే... నరకద్వారం దగ్గరే నిలబడిపోయారు!! లోపలున్న వాళ్లందర్నీ బైటికి రప్పిస్తూ... కూపంలో పడబోతున్నవాళ్లని ఆపేస్తూ... పదేళ్లకు పైగా అక్కడే ‘డ్యూటీ’ చేస్తున్నారు! ఎందుకంత ప్రమాదకరమైన బాధ్యతను తన భుజాలపై మోస్తున్నారు? ఈ ప్రశ్నకు ఆవిడ సమాధానం ఒక్కటే: ‘నరకం ఎలా ఉంటుందో నాకు తెలుసు. తెలిసీ నా అక్కచెల్లెళ్లను, ఆడబిడ్డల్ని ,ఆ బిడ్డల బిడ్డల్ని ఎలా వదిలి వెళ్లగలను?’ అని! ఇంతకీ జయమ్మ చూసిన నరకం ఏమిటి? Read more... కద్దూ కా ఖీర్ చేయడానికి కావలసిన పదార్థాలు మరియు తయారుచేసే పద్ధతి కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
http://telugutaruni.weebly.com/2/post/2013/07/72.html ![]() నలభై ఏళ్లకీ, యాభై ఏళ్లకీ స్కూబా డైవింగ్ చేసిన వాళ్లున్నారు. కానీ ఊత కర్రతో నడిచే డెబ్భై తొమ్మిదేళ్ల వయసులో పదమూడు వేల ఐదొందల అడుగుల ఎత్తు నుంచి ఆ సాహసం చేసింది అమెరికాకు చెందిన కరోలిన్. ఈ వయసులో అంతటి సాహసం ఎందుకంటే... చిన్న నాటి కలను తీర్చుకోవాలన్న తపనే కారణం అని చెబుతుంది. ''చిన్నప్పట్నుంచీ నాకు స్కూబా డైవింగ్ అంటే ఆసక్తి. ఓసారి ప్యారాచూట్తో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ప్రమాదవశాత్తు కిందపడ్డాను. ఛాతి భాగంలో చిన్న దెబ్బ తగిలింది. వైద్యులు అలాంటి సాహసాలు వద్దని చెప్పారు. నేనూ భయపడి దూరంగా ఉన్నాను. తరవాత పెళ్లయ్యింది. నౌకాదళంలో ఆఫీసర్గా పని చేశాను. ఇంటి బాధ్యతలూ, ఉద్యోగం.. చూస్తుండగానే వృద్ధాప్యం వచ్చేసింది. అయినా మనసులో చిన్నప్పటి కోరిక తీరలేదన్న వెలితి ఉండిపోయింది. ఇదే విషయం మా అబ్బాయిలతో అంటే ఆ సాహసం ఇప్పుడు చెయ్యమన్నారు. దాంతో కొంతకాలం ప్రాక్టీస్ చేసి ఈ ఫీట్ సాధించగలిగాను' అని చెప్పింది. అప్పుడు భయపడ్డారు కదా, మరి ఇప్పుడెలా చేశారని అడిగితే 'ఇప్పుడూ కొన్ని క్షణాలు భయం వేసింది. ఆ కాసేపు గట్టిగా కళ్లు మూసుకున్నా' అని బదులిచ్చింది.
![]() అమెరికా రచయిత్రిగా గుర్తింపు
1988లో నేషనల్ బుక్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డు దేశ, అంతర్జాతీయంగా పాపులారిటీ తెచ్చిన నవలలు రచయిత్రిగా చెరగని ముద్ర మహిళా రచయితలకు స్ఫూర్తి జర్నలిజంలోనూ రాణింపు వలస రచయిత్రిగా వెళ్లినా భారతీ ముఖర్జీ, అమెరికా రచయిత్రిగాగుర్తింపు పొంది, ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీని పొందారు . దేశ, అంతర్జాతీయంగా పలు నవలలు, చిన్నకథలు, వ్యాసాలు రాయడంలో దిట్ట అనే ముద్ర వేయించుకున్నారు. చిన్న పిల్లలకు కథలు పలువురి ఎంతగానో అకట్టుకున్నాయి. దేశ విదేశాల్లో ఇప్పటికీ ఈమె పుస్తకాలు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. భారత రచయిత్రిగా కంటే అమెరిక రచయిత్రిగానే ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ పాపులారిటీని సంపాదించుకున్నారు భారతీ. Read more ... ![]() ఆమె వయస్సు నలబై నాలుగు.
ముగ్గురు పిల్లలకు తల్లి. ఒక పాపకు అమ్మమ్మ. ఇప్పుడు నాలుగు నెలల గర్భిణి. నలబై రెండు కిలోమీటర్ల మారథాన్ లో విజేతగా నిలిచి రికార్డ్ సృష్టించింది. Read more...... ![]() పెళ్లి చేసుకోనన్నందుకు, ప్రేమించనందుకు, చెప్పిన మాట వినలేదని.... ఇలా చిన్న చిన్న కారణాలకే మగవాడి అహం దెబ్బతింటుంది. దెబ్బతిన్న అహాన్ని చల్లార్చుకోవడానికి ఆడవాళ్ల పై యాసిడ్ దాడి చేయడం పెరిగింది. దాడి తీవ్రత, అందిన చికిత్స బట్టి కొందరు ప్రాణాలతో ఉంటున్నారు. కొందరు మరణిస్తున్నారు. "యాసిడ్ దాడుల్ని నివారించాలంటే పచారీ కొట్టులో చాక్లెట్‌లు అమ్మినట్టు యాసిడ్ అమ్మకూడదు. యాసిడ్ అమ్మకాలపై నియంత్రణ ఉండా''లంటూ లక్ష్మి అనే యాసిడ్ బాధితురాలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించి ఈ విషయమై చర్యలు తీసుకునేందుకు భారత ప్రభుత్వానికి వారం రోజుల గడువు ఇచ్చింది. ఈ లోగా ప్రతి ఒక్కరూ ఈ పిటిషన్‌పై సంతకం చేయాలి అంటున్న లక్ష్మి ఆ పిటిషన్‌లో ఏం రాశారో చదవండి.
"పదిహేనేళ్ల వయసులో ఓ ఇద్దరు మగవాళ్లు నా పై యాసిడ్ దాడికి పాల్పడ్డారు. కారణం వాళ్లలో ఒకరిని పెళ్లి చేసుకునేందుకు నేను ఒప్పుకోకపోవడమే. దాడి జరిగి ఎనిమిదేళ్లు అవుతోంది. కాని పరిస్థితుల్లో మాత్రం ఎటువంటి మార్పూ రాలేదు. మన దేశంలో గత మూడు నెలల్లో మహిళలపై 60కి పైగా యాసిడ్ దాడులు జరిగాయనేది ఒక నివేదిక. నాలాగా మరే మహిళా యాసిడ్ దాడికి గురికాకూడదనే ఉద్దేశంతో యాసిడ్‌కు వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించుకున్నాను. అందుకని న్యాయం కోరుతూ భారతదేశంలో యాసిడ్ అమ్మకాలపై నియంత్రణ విధించాలని సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేశాను. సుప్రీంకోర్టు భారత ప్రభుత్వానికి వారం రోజుల గడువు ఇచ్చి అందుకు తగ్గట్టుగా పాలసీని తయారుచేయమని చెప్పింది. దానికి మద్దతుగా నేను ఈ పిటిషన్‌ను ప్రారంభించాను. దీనిద్వారా కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే గారికి రిటెయిల్‌గా జరిగే యాసిడ్ అమ్మకాలను క్రమబద్ధీకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. యాసిడ్ అమ్మకాలను క్రమబద్దీకరించడంలో ఆలస్యం జరుగుతున్న ప్రతి ఒక్క రోజుకీ ఎందరో మహిళలు భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తున్నది. అందుకని కేంద్ర హోం మంత్రిపై ఒత్తిడి తేవాలి. ఈ విషయంలో దేశం మొత్తం ఎదురుచూస్తుందనే విషయం ప్రభుత్వానికి అర్థం కావాలి. ఇది తెలియచేసేందుకు వారం రోజుల సమయం కూడా మన దగ్గర లేదు. అందుకని మీరూ నాతో చేతులు కలిపి హోం మంత్రి యాసిడ్ అమ్మకాలను నియంత్రించే చర్యలు తీసుకునేలా చూడండి. ఈ పిటిషన్ మీద సంతకం చేయండి. దీన్ని మీ స్నేహితులకి, కుటుంబ సభ్యులకి కూడా పంపండి. భారదేశంలోని ఎందరో ఆడవాళ్ల జీవితాలను కాపాడండి. సంతకం చేయబోతున్న వాళ్లందరికీ ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. లక్ష్మి పిటిషన్‌పై సంతకం చేయడం కోసం ఈ వెబ్ లింక్ చూడండి. http://www.change.org/stopacidattacks |