telugutaruni.weebly.com
  • Home
  • వంటకాలు (Cookeries)
    • ఫలహారాలు (Tiffins)
    • శాకాహారం (Veg)
    • బియ్యపు వంటలు (Rice items)
    • మాంసాహారం (Non-Veg)
    • పచ్చళ్ళు (chutneys)
    • వడియాలు
    • పండ్ల రసాలు (Juices)
    • స్వీట్స్ (Sweets)
    • చిరుతిళ్ళు (Snacks)
    • గ్రేవీ ఐటమ్స్
    • సూప్స్ (Soops)
    • కొత్త కొత్తగా
  • చిట్కాలు (Tips)
    • వంటింటి చిట్కాలు ( Kitchen Tips)
    • ఆరోగ్య చిట్కాలు (Health Tips)
    • సౌందర్య చిట్కాలు (Beauty Tips)
  • మహిళా లోకం
    • ఆదర్శ మహిళలు
    • శభాష్ మహిళా..
  • విహారయాత్ర

పంజాబీ లస్సీ

9/21/2013

0 Comments

 
Picture
కావలసిన పదార్థాలు:
క్రీమ్ - 50 గ్రా.; 
ఐస్ క్యూబ్స్ - 100 గ్రా.; 
రోజ్ ఎసెన్స్ - కొద్దిగా; 
పంచదార - 150 గ్రా.; 
పెరుగు - అర కిలో.

తయారు చేసే విధానం:
ఒక పెద్ద పాత్రలో పెరుగు, ఐస్ క్యూబ్స్, పంచదార వేసి బాగా గిలక్కొట్టాలి 
పొడవాటి గ్లాసులో తయారు చేసి ఉంచుకున్న పెరుగు మిశ్రమం, రోజ్ ఎసెన్స్ వేసి ఫ్రిజ్‌లో ఉంచాలి 
సర్వ్ చేసే ముందు క్రీమ్‌తో గార్నిష్ చేయాలి.


0 Comments

బనానా, రోజ్ మిల్క్ షేక్

8/27/2013

0 Comments

 
Picture
కావలసిన పదార్థాలు :
అరటి పండు ముక్కలు - 1 కప్పు
పాలు - 1 కప్పు
రోజ్ సిరప్ లేదా రూహ్అఫ్జా - 3-4 టీ.స్పూ.
పంచదార - 3 టీ.స్పూ.
ఐస్ ముక్కలు- కొన్ని
జీడిపప్పు, బాదం పప్పు - 6



తయారుచేసే పద్ధతి :
  • మగ్గిన అరటిపండు ముక్కలు, పంచదార వేసి మిక్సీలో బ్లెండ్ చేయాలి. ఇందులో పాలు, ఐస్ ముక్కలు, రోజ్ సిరప్ వేసి నురగ వచ్చేలా బ్లెండ్ చేసి పొడవాటి గ్లాసుల్లో పోసి సన్నగా తరిగిన జీడిపప్పు, బాదం పప్పుతో అలంకరించి చల్లగా సర్వ్ చేయాలి. దీని కోసం చల్లటి పాలనే ఉపయోగించాలి. ఈ మిల్క్ షేక్ సర్వ్ చేసే ముందే కలుపుకోవాలి. ముందే చేసి పెట్టుకుంటే అరటి పండు మూలంగా రంగు మారొచ్చు.

0 Comments

రష్యన్‌ సలాడ్‌

7/10/2013

0 Comments

 
Picture
కావలసిన పదార్థాలు...
పచ్చి బఠాణీలు      : ఒక కప్పు
బీన్స్‌, క్యారెట్‌ ముక్కలు  : చెరో కప్పు 
బొప్పాయి, చెర్రీ, ఫైనాఫిల్‌ ముక్కలు  : అన్నీ కలిపి 2 కప్పులు
పాలు                   : ఒక కప్పు
మైదా, వెన్న         : అర టీస్పూన్‌ చొప్పున
మిరియాల పొడి    : ఒక టీస్పూన్‌
ఉప్పు                  : అర టీస్పూన్‌

తయారీ విధానం...
  • ముందుగా పచ్చిబఠాణీ, బీన్స్‌, క్యారెట్‌ ముక్కలను ఉడికించి పెట్టుకోవాలి. 
  • పాలల్లో వెన్న, మైదాపిండి కలిపి సన్నటి మంటపై వేడి చేయాలి. 
  • ఈ పదార్థం ఉడుకుతుండగా గట్టిపడి క్రీంలాగా తయారవుతుంది. ఇప్పుడు దాంట్లో ఉడికించి ఉంచుకున్న కూరగాయ ముక్కలను, పండ్ల ముక్కలను వేసి బాగా కలియ బెట్టాలి. 
  • పైన మిరి యాలపొడి, ఉప్ప చల్లితే పోషకాల రష్యన్‌ సలాడ్‌ తయారైనట్లే..!
  • ఈ పదార్థం పూర్తిగా పండ్లు, కూరగాయలు, పాలతో తయారైనది కాబట్టి పోషకాలు మెండుగా లభిస్తాయి. 



0 Comments

సొరకాయ జ్యూస్ 

6/26/2013

0 Comments

 
Picture
కావలసిన పదార్థాలు : 
సొరకాయ           - ఒకటి (మీడియం సైజ్), 
పుదీనా ఆకులు  - పది,
అల్లం తురుము   - ఒక టీస్పూన్, 
నల్ల ఉప్పు          -రెండు చిటికెలు, 
నిమ్మరసం        - రెండు టీస్పూన్‌లు.




తయారుచేసే పద్ధతి : 
  • సొరకాయను కడిగి తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. మిక్సీలో పుదీనా ఆకులు, అల్లం తురుము, సొరకాయ ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. తరువాత వడకట్టి రుచికి సరిపడా నిమ్మరసం, ఉప్పు కలుపుకుని తాగాలి.

మూలం : ఆంద్రజ్యోతి దినపత్రిక 


0 Comments

రష్యన్‌ సలాడ్‌

6/25/2013

0 Comments

 
Picture
కావలసిన పదార్థాలు :
పచ్చి బఠాణీలు :            ఒక కప్పు
బీన్స్‌, క్యారెట్‌ ముక్కలు : చెరో కప్పు 
బొప్పాయి, చెర్రీ, ఫైనాఫిల్‌ ముక్కలు : అన్నీ కలిపి 2 కప్పులు
పాలు :                       ఒక కప్పు
మైదా, వెన్న.              అర టీస్పూన్‌ చొప్పున
మిరియాల పొడి :           ఒక టీస్పూన్‌
ఉప్పు :                       అర టీస్పూన్‌



తయారుచేసే విధానం :
  • ముందుగా పచ్చిబఠాణీ, బీన్స్‌, క్యారెట్‌ ముక్కలను ఉడికించి పెట్టుకోవాలి. 
  • పాలల్లో వెన్న, మైదాపిండి కలిపి సన్నటి మంటపై వేడి చేయాలి. ఈ పదార్థం ఉడుకుతుండగా గట్టిపడి క్రీంలాగా తయారవుతుంది. ఇప్పుడు దాంట్లో ఉడికించి ఉంచుకున్న కూరగాయ ముక్కలను, పండ్ల ముక్కలను వేసి బాగా కలియ బెట్టాలి. పైన మిరి యాలపొడి, ఉప్ప చల్లి తే పోషకాల రష్యన్‌ సలాడ్‌ తయారైనట్లే..! 
  • ఈ పదార్థం పూర్తిగా పండ్లు, కూరగాయలు, పాలతో తయారైనది కాబట్టి పోషకాలు మెండుగా లభిస్తాయి. 


మూలం : సూర్య దినపత్రిక 

0 Comments

కారమిలైజ్డ్ యాపిల్ చాకో మౌసె

6/14/2013

0 Comments

 
Picture
కావలసిన పదార్థాలు :
యాపిల్        -            ఒకటి 
పాలు           -            100 గ్రా.
చక్కెర          -              10 గ్రా.
గిలక్కొట్టిన క్రీం-               100 గ్రా.
చాక్లెట్          -               100 గ్రా.
జెలాటిన్       -               10 గ్రా.
వెన్న           -                20 గ్రా.






తయారుచేసే పద్ధతి :
  • యాపిల్ చెక్కు తీసి ముక్కల్లా తరిగి వెన్నలో వేయించాలి.
  • తరువాత అందులో సగం చక్కెర వేసి మంట తగ్గించి మధ్య మధ్య కలుపుతూ ఉండాలి. చక్కెర కరిగి, యాపిల్ ముక్కలు మెత్తగా అయ్యాక పొయ్యి మీద నుంచి దింపేయాలి. ఇప్పుడు ఓ గిన్నెలో పాలూ, మిగిలిన చక్కెర, చాక్లెట్ తీసుకొని పొయ్యి మీద పెట్టాలి. పాలు మరిగి, చాక్లెట్ కరిగాక గిలక్కొట్టిన క్రీం, ముందుగా సిద్దం చేసుకున్న యాపిల్ మిశ్రమం, గోరు వెచ్చని నీటిలో కలిపిన జెలాటిన్ ని వేసి బాగా కలిపి రెండు మూడు నిమిషాలయ్యాక దింపేయాలి. దీన్ని ఫ్రిజ్ లో పెట్టి చల్లగా అయ్యాక తీసుకోవాలి.

మూలం : ఈనాడు వసుంధర 

0 Comments

రోజ్ మిల్క్ షేక్ 

6/14/2013

0 Comments

 
Picture
కావలసిన పదార్థాలు :
పాలు            -            100 గ్రా.
చక్కెర          -              100 గ్రా.
గిలక్కొట్టిన క్రీం-               100 గ్రా.
గుడ్డు            -              ఒకటి 
రోజ్ సిరప్      -              100 గ్రా. కన్నా కొంచెం తక్కువ 




తయారుచేసే పద్ధతి :
  • ఓ గిన్నెలో పాలు తీసుకొని, క్రీం, చక్కెర వేసి బాగా కలపాలి.
  • ఆ తర్వాత గిలక్కొట్టిన గుడ్డు సొనతో పాటు మిగిలిన అన్నీ పదార్థాలన్నీ ఒక్కొక్కటిగా వేసి మరోసారి కలిపితే సరిపోతుంది. ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్ లో రెండు గంటల పాటు ఉండనివ్వాలి.
  • ఇది మరింత చల్లగా ఉండాలనుకుంటే రెండు లేక మూడు ఐస్ ముక్కల్ని వేసుకుంటే సరిపోతుంది.

మూలం : ఈనాడు వసుంధర 

0 Comments

కీరదోస మిల్క్ షేక్ 

6/14/2013

0 Comments

 
Picture
కావలసిన పదార్థాలు :
కీరదోస         -            నాలుగు 
పాలు            -            ఒకటిన్నర లీటర్ 
చక్కెర          -              200 గ్రా.
యాలకుల పొడి -          అరచెంచ 
జీడిపప్పు, ఎండు ద్రాక్ష, బాదం, పిస్తా - అన్నీ కలిపి 75 గ్రా.
నెయ్యి          -            రెండు చెంచాలు 




తయారుచేసే పద్ధతి :
  • కీరదోస చెక్కుతోపాటు గింజల్నీ తీసేసి మెత్తని గుజ్జులా చేసి పెట్టుకోవాలి.
  • ఓ గిన్నెలో పాలు తీసుకొని, చక్కెర వేసి పొయ్యి మీద పెట్టాలి. అవి మరిగాక అందులో కీరదోస గుజ్జు వేసి బాగా కలపాలి. మంట తగ్గించి మధ్య మధ్య కలుపుతూ ఉంటే కాసేపటికి అది చిక్కబడుతుంది.
  • ఓ బాణలిలో నెయ్యి వేడి చేసి జీడిపప్పు, ఎండు ద్రాక్ష, బాదం, పిస్తా పలుకుల్ని వేయించుకోవాలి. ఎండు ద్రాక్ష తప్ప మిగిలిన అన్నీ పలుకుల్ని మెత్తగా కాకుండా పోడిలా చేసుకోవాలి. 
  • ఇప్పుడు ఎండు ద్రాక్ష, డ్రై ఫ్రూట్స్ పొడి, యాలకుల పొడి పాలల్లో వేసి వేసి మళ్ళీ కలిపి ఫ్రిజ్ లో పెట్టుకోవాలి.

మూలం : ఈనాడు వసుంధర 

0 Comments

గ్రీన్ టీ హనీ మిక్స్ 

6/14/2013

0 Comments

 
Picture
కావలసిన పదార్థాలు :
పాలు            -            100 గ్రా.
చక్కెర          -              10 గ్రా.
గిలక్కొట్టిన క్రీం-               100 గ్రా.
తేనె              -               10 గ్రా.
జెలాటిన్        -               10 గ్రా.
గ్రీన్ టీ ఆకులు -               ఒకటిన్నర చెంచ 
నిమ్మరసం     -                చెంచ 
నిమ్మపొట్టు పొడి -             చిటికెడు 


తయారుచేసే పద్ధతి :
  • ఓ గిన్నెలో పాలను తీసుకొని పొయ్యి మీద పెట్టాలి. అవి మరిగాక చక్కెర, తేనె, గ్రీన్ టీ ఆకులు వేసి మరికొంచెం సేపు పొయ్యి మీద ఉంచాలి. పాలు మళ్ళీ ఒక పొంగు వచ్చాక వడకట్టి ఓ గిన్నెలోకి తీసుకొని పది నిమిషాలు ఫ్రిజ్ లో ఉంచి బయటకి తీయాలి. 
  • అందులో గిలక్కొట్టిన క్రీం, నిమ్మరసం, నిమ్మపొట్టు పొడి, చివరగా జెలాటిన్ ని కూడా వేసి బాగా కలిపి మళ్ళీ ఫ్రిజ్ లో ఉంచేయాలి. చల్లగా ఉండే ఈ గ్రీన్ టీ పానీయం చాలా రుచిగా ఉంటుంది.

మూలం : ఈనాడు వసుంధర 

0 Comments

వాటర్ మెలన్ జ్యూస్ 

6/14/2013

0 Comments

 
Picture
కావలసిన పదార్థాలు :
నిమ్మకాయ    -         ఒకటి (పెద్దది)
పుచ్చకాయ ముక్కలు - మూడు కప్పులు 
సోడా             -         50 మి.లీ 
పంచదార       -          అరకప్పు 





తయారుచేసే పద్ధతి :
  • ముందుగా నిమ్మరసం తీసి పక్కన ఉంచుకోవాలి.
  • పంచదారను కొద్ది నీళ్ళలో వేసి కరిగించుకోవాలి.
  • పుచ్చకాయలను మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
  • నిమ్మరసం, పంచదార నీళ్ళు కూడా వేసి మళ్ళీ ఒకసారి తిప్పి వడబోయాలి.
  • ఫ్రిజ్ లో ఉంచాలి.
  • సర్వ్ చేసే ముందు సోడా కలిపితే రుచిగా ఉంటుంది.

మూలం : సాక్షి దినపత్రిక 

0 Comments
<<Previous

    Author

    నా పేరు సునయన ( ఉరఫ్ నర్మద). సు అంటే "మంచిది" అని, నయన అంటే "నేత్రములు" . సునయన అంటే మంచి కన్నులు కలది అని అర్థం. నా కళ్లతో చూస్తున్న ఈ  మహిళా ప్రపంచాన్ని మీముందు ఉంచాలని, అది మన మహిళాలోకానికి మేలు చేకూర్చాలని ఆశీస్తూ మనలో  ఒక  తెలుగు తరుణిగా నా ఈ చిన్ని ప్రయత్నం. 

    Categories

    All
    ఆమ్ కా పన్నా
    బీట్ రూట్ లస్సి
    కివీ డిలైట్
    బ్లూ లాగున్
    రోజ్ మిల్క్ షేక్
    బనానా
    సలాడ్
    ఆపిల్ టినీ మాక్ టైల్
    వాటర్ మెలన్ జ్యూస్
    మామిడి
    కర్బూజ
    గ్రీన్ టీ హనీ మిక్స్
    మిమోసా మాక్ టైల్
    పంజాబీ లస్సీ
    గులాభీ షర్బత్
    సొరకాయ జ్యూస్
    కీరదోస మిల్క్ షేక్
    జింజర్ ఫ్రూట్ పంచ్
    క్యారట్
    మ్యాంగో సన్ షైన్
    కర్బూజా షర్బత్
    రష్యన్‌ సలాడ్‌
    వర్జిన్ మొజితో..
    పుచ్చపండు
    కారమిలైజ్డ్ యాపిల్ చాకో మౌసె
    స్ట్రాబెర్రీ బ్లాజమ్
    Mixed Fruits

    Archives

    September 2013
    August 2013
    July 2013
    June 2013
    May 2013
    April 2013

    RSS Feed

    Enter your email address:

    Delivered by FeedBurner


Powered by Create your own unique website with customizable templates.