telugutaruni.weebly.com
  • Home
  • వంటకాలు (Cookeries)
    • ఫలహారాలు (Tiffins)
    • శాకాహారం (Veg)
    • బియ్యపు వంటలు (Rice items)
    • మాంసాహారం (Non-Veg)
    • పచ్చళ్ళు (chutneys)
    • వడియాలు
    • పండ్ల రసాలు (Juices)
    • స్వీట్స్ (Sweets)
    • చిరుతిళ్ళు (Snacks)
    • గ్రేవీ ఐటమ్స్
    • సూప్స్ (Soops)
    • కొత్త కొత్తగా
  • చిట్కాలు (Tips)
    • వంటింటి చిట్కాలు ( Kitchen Tips)
    • ఆరోగ్య చిట్కాలు (Health Tips)
    • సౌందర్య చిట్కాలు (Beauty Tips)
  • మహిళా లోకం
    • ఆదర్శ మహిళలు
    • శభాష్ మహిళా..
  • విహారయాత్ర

చిక్కుడు ఆవకాయ

1/6/2014

0 Comments

 
Picture
కావలసినవి:
 చిక్కుడుకాయలు - కిలో; 
పప్పు నూనె - పావు కిలో; 
కారం - 100 గ్రా; 
ఉప్పు - 100 గ్రాములకు కొద్దిగా తక్కువ; 
ఆవపిండి - 100 గ్రా; 
మెంతులు - టేబుల్ స్పూను; 
చింతపండు - పావుకిలో
 
 తయారి:
  •  చిక్కుడుకాయలను శుభ్రంగా కడిగి, ఈనెలు తీయాలి   
  •  బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక, చిక్కుడుకాయలను అందులో వేసి బాగా వేయించి తీసేయాలి   
  •  ఒక పాత్రలో ఆవపిండి, ఉప్పు, కారం, మెంతులు, చింతపండు, కొద్దిగా నూనె వేసి కలపాలి   
  •  వేయించి ఉంచుకున్న చిక్కుడుకాయలను జతచేసి బాగా కలపాలి   
  •  చివరగా నూనె పోసి గాలిచొరని పాత్రలో ఉంచి, మూడవ రోజు తిరగ కలపాలి  
  •  ఇది అన్నంలోకి రుచిగా ఉంటుంది (ఎక్కువ రోజులు నిల్వ ఉండదు కనుక, తగు పరిమాణంలో తయారుచేసుకుంటే మంచిది)

0 Comments

ఉసిరికాయ పచ్చడి

12/12/2013

0 Comments

 
Picture
కావలసిన పదార్థాలు :
ఉసిరికాయలు - ఒక కేజీ, 
జీలకర్ర - ఒక టీ స్పూన్, 
ఆవాలు - 2 టీ స్పూన్స్,
మెంతులు - 2 టీ స్పూన్స్, 
వెల్లుల్లిపాయలు - 3(పెద్దవి), 
ఎండు మిరపకాయలు - 10, 
కారం - 25(గా. ,
 చింతపండు - 24(గా. 
ఉప్పు - 26(గా. 
నూనె - 25(గా. 

తయారు చేసే విధానం : 
  • కడాయిలో నూనె వెయ్యకుండా మెంతులను వేయించి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి.
  • చింతపండును అరగంట పాటు నానబెట్టాలి. ఆ తర్వాత దాన్ని సన్నని మంట మీద ఉడికించాలి. చింతపండు రసం చిక్కగా అయ్యేవరకు వేడిచేసి పక్కన పెట్టుకోవాలి.
  • ఉసిరికాయలను కడిగి మంచిగా తుడవాలి. ఇప్పుడు కడాయిలో నూనె పోసి ఉసిరికాయలను గోల్డెన్ కలర్ వచ్చేవరకు వేయించి తీయాలి. వీటిని ఒక పెద్ద గిన్నెలో వేసి కాసేపు చల్లారనివ్వాలి.
  • దీంట్లో చింతపండు పేస్ట్, ఉప్పు, కారం, మెంతిపిండి, వెల్లుల్లిపాయలు వేసి బాగా కలపాలి.
  • మరోసారి కడాయి పెట్టి జీలకర్ర, ఆవాలు, మెంతులు వేగాక ఎండుమిరపకాయలు వేసి వేగనివ్వాలి. ఇందులో అన్నీ కలిపి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలను వేసి దించేయాలి. చ
  • ల్లారాక జాడీలో భద్రపరచాలి. నోరూరించే.. కమ్మని ఉసిరికాయ పచ్చడి తయారైనట్లే!

0 Comments

క్యాప్సికం పచ్చడి

11/28/2013

0 Comments

 
Picture
కావలసిన పదార్థాలు :
క్యాప్సికం - 5, 
కారం - ఒక టీ స్పూన్, 
మెంతులు - పావు టీ స్పూన్,
 ఆవాలు - అర టీ స్పూన్
 పసుపు - కొద్దిగా,
 ఇంగువ - కొంచెం, 
నిమ్మకాయలు - 2, 
నూనె, ఉప్పు - తగినంత

తయారు చేసే విధానం :
  • క్యాప్సికంను కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 
  • కడాయిలో కొద్దిగా నూనె పోసి ఆవాలు, జీలకర్ర వేయించాలి. దీంట్లోనే కారం, పసుపు, ఇంగువ వేసి కలపాలి. 
  • ఆ తర్వాత క్యాప్సికం ముక్కలు, ఉప్పు వేసి మూత పెట్టాలి. సన్నని మంట మీద వేగనివ్వాలి. మధ్య, మధ్యలో రెండుమూడు సార్లు కలపాలి. 
  • ముక్క ఉడికితే దించేసి కాసేపు చల్లారనివ్వాలి. దీంట్లో నిమ్మరసం కలిపి జాడీలోకి ఎత్తుకోవాలి. 
  • గాలి తగలకుండా మూత పెట్టేయాలి. ఈ పచ్చడి వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది.

0 Comments

టొమాటో - పండుమిర్చి పచ్చడి

10/25/2013

0 Comments

 
Picture
కావలసినవి:
 టొమాటో ముక్కలు- 2 కప్పులు;

పండుమిర్చి ముక్కలు - 1/2 కప్పు;
జీలకర్ర పొడి - టీ స్పూన్;
పసుపు - 1/4 టీస్పూన్;
మెంతిపొడి - 1/4 టీ స్పూన్;
ఆవాలు, జీలకర్ర - 1/4 టీస్పూన్ చొప్పున;
కరివేపాకు - 1 రెమ్మ;
ఉప్పు - తగినంత;
నూనె - 3 టీ స్పూన్లు;
 
 తయారి:
  •  మిక్సీలో టొమాటో ముక్కలు, పండుమిర్చి ముక్కలు వేసి మెత్తగా చేయాలి.
  • బాణలిలో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక కరివేపాకు, రుబ్బిన టొమాటో, మిర్చి మిశ్రమాన్ని వేయాలి. మూతపెట్టి నిదానంగా ఉడికించాలి.
  • నీరంతా ఇగిరిపోయి, చిక్కబడుతున్నప్పుడు జీలకర్ర పొడి, మెంతిపొడి, కారం పొడి, పసుపు, తగినంత ఉప్పు వేసి కలిపి నూనె తేలేవరకు ఉడికించి దింపేయాలి. ఈ పచ్చడి  మూడు రోజులు నిలువ ఉంటుంది.

0 Comments

నిమ్మ - టొమాటో పచ్చడి

10/19/2013

0 Comments

 
Picture
కావలసినవి:
 టొమాటోలు - 250 గ్రా;

నిమ్మరసం- 2 టేబుల్ స్పూన్లు;
పసుపు - 1/4 టీస్పూన్;
కారంపొడి -  టేబుల్‌స్పూన్;
ఉప్పు - తగినంత;
జీలకర్ర పొడి -  టీస్పూన్;
మెంతి పొడి - 1/4 టీస్పూన్;
నూనె - 2 టేబుల్ స్పూన్లు;
ఎండుమిర్చి - 2;
ఆవాలు - 1/4 టీస్పూన్;
జీలకర్ర - 1/4 టీస్పూన్;
ఇంగువ - చిటికెడు;
కరివేపాకు - 1 రెమ్మ.
 
 తయారి:
 టొమాటోలను నాలుగు ముక్కలుగా కట్ చేయాలి. బాణలిలో నూనె వేడి చేసి, ఇంగువ, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించాలి. కరివేపాకు, టొమాటో ముక్కలు వేసి మూతపెట్టి మగ్గనివ్వాలి. (టొమాటో ముక్కలు పూర్తిగా మెత్తబడనివ్వకూడదు). పసుపు, కారం, ఉప్పు, జీలకర్ర, మెంతిపొడులు వేసి మెల్లిగా కలిపి (గరిటతో కాకుండా పాన్‌నే మెల్లగా కదిపితే మంచిది) మరో ఐదు నిమిషాలు ఉడికించి దింపేయాలి. చల్లారాక నిమ్మరసం వేయాలి. మొత్తం కలిపి ఓ గంటపాటు అలాగే ఉంచి ఆ తర్వాత వడ్డించవచ్చు.


0 Comments

ఉసిరిపచ్చడి

9/20/2013

0 Comments

 
Picture
కావలసిన పదార్థాలు :
ఉసిరికాయలు-పావుకిలో,

పచ్చిమిర్చి-ఆరు
పెరుగు-లీటరు,

ఇంగువ-చిటికెడు
పసుపు-పావు టీస్పూన్‌,

నూనె-సరిపడా
ఉప్పు-తగినంత,

కరివేపాకు-రెండు రెబ్బలు
ఆవాలు-ఒక టీస్పూన్‌,

మినపప్పు-ఒక టీస్పూన్‌

తయారుచేసే విధానం
  • ఉసిరికాయల్ని గింజలు తీసేసి నిలువు ముక్కలుగా కోయాలి. మరీ ముక్కలుగా నమలడం ఇష్టంలేనివాళ్లు కాస్త కచ్చాపచ్చాగా ఉండేలా ఓసారి దంచి తీయవచ్చు.
  • పాన్‌లో కొద్దిగా నూనెవేసి ఆవాలు, ఇంగువ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. ఉసిరికాయ తొక్కు కూడా వేసి వేగనివ్వాలి. తొక్కు నుంచి బయటకు వచ్చిన నీళ్లన్నీ ఆవిరయ్యే వరకూ వేయించాలి తరువాత పసుపు, ఉప్పు, పెరుగు వేసి బాగా కలపాలి.

0 Comments

బీట్‌రూట్‌ పచ్చడి

9/16/2013

0 Comments

 
Picture
కావలసిన పదార్థాలు :
బీట్‌రూట్‌ ముక్కలు-రెండు కప్పులు
పెరుగు-ఒక కప్పు
పచ్చిమిర్చి-మూడు, ఉడికించిన టమాట గుజ్జు-మూడు చెంచాలు
నిమ్మకాయ -ఒకటి, పలుచని మజ్జిగ-అరకప్పు
కొబ్బరితురుము-మూడు కప్పులు
ఉల్లిపాయముక్కలు-మూడు చెంచాలు
కొత్తిమీర, కరివేపాకు -కొద్దిగా


తయారుచేసే విధానం
బీట్‌రూట్‌ ముక్కల్ని సన్నగా తరిగి పచ్చిమిర్చి, మజ్జిగ చేర్చి కుక్కర్‌లో ఒకటి రెండు కూతలు వచ్చేదాకా ఉడికించాలి. ఆ ముక్కలు చల్లారాక కొబ్బరి తురుము, ఉడికించిన టమాటగుజ్జు, నిమ్మరసం, ఉల్లిపాయముక్కలు, బీట్‌రూట్‌లో కలిపి చివరగా పెరుగు వేయాలి. పైన కొత్తిమీర, కరివేపాకు తరుగు చల్లితే సరిపోతుంది. బీట్‌రూట్‌ను మజ్జిగలో ఉడికించడం వల్ల ముక్కల్లో ఉండే చప్పదనం తగ్గుతుంది. బీట్‌రూట్‌లో సహజమైన ఉప్పు ఉంటుంది. ఇది పాలకూర అన్నంలోకి చాలా బాగుంటుంది.  


0 Comments

టమాటా, కొబ్బరి పచ్చడి

9/14/2013

0 Comments

 
Picture
కావలసిన పదార్థాలు :
పండిన టమాటాలు- 250 గ్రాములు
పచ్చి కొబ్బరి- 100 గ్రాములు
పచ్చి మిర్చి- 4-5
జీలకర్ర- 1 టి.స్పూన్
నువ్వులు- 3 టీస్పూన్లు
ఉప్పు- తగినంత
ఆవాలు, జీలకర్ర-
1/4 టి.స్పూన్
కరివేపాకు- 2 రెబ్బలు
నూనె- 4 టీ. స్పూన్లు


తయారుచేసే పద్ధతి :
పండిన టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే పచ్చి కొబ్బరి కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పాన్లో రెండు చెంచాలు నూనె వేడిచేసి జీలకర్ర, నువ్వులు వేయించి టమాటా ముక్కలు, కొబ్బరిముక్కలు వేసి కలిపి మరి కొద్దిసేపు వేయించాలి. చల్లారిన తర్వాత మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చిన్న పాన్ లేదా గరిటలో మిగిలిన నూనె వేడిచేసి ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక కరివేపాకు వేసి రుబ్బుకున్న పచ్చడిలో కలుపుకోవాలి. ఈ పచ్చడి ఇడ్లీ, దోశలోకి బావుంటుంది.


0 Comments

నువ్వుల పచ్చడి

9/4/2013

0 Comments

 
Picture
కావలసిన పదార్థాలు :
నువ్వులపప్పు-కప్పు,

తాజాపెరుగు-మూడు కప్పులు
నిమ్మకాయ-ఒకటి
ఉప్పు-తగినంత
పసుపు-పావు టీస్పూను
పచ్చిమిర్చి-నాలుగు
ఎండుమిర్చి-రెండు,

ఆవాలు-ఒక టీస్పూను
మెంతులు-ఒక టీస్పూను
కరివేపాకు-రెండు రెబ్బలు
నూనె-రెండు టేబుల్‌స్పూను


తయారుచేసే విధానం
  • నువ్వులపప్పు కొద్దిగా వేయించి తీయాలి.
  • కాస్త నూనెలో పచ్చిమిర్చి వేయించి తీయాలి.
  • ఇప్పుడు పచ్చిమిర్చి, నువ్వులు కలిపి మెత్తగా రుబ్బాలి.
  • తరువాత ఈ మిశ్రమాన్ని పెరుగులో వేసి కలపాలి. ఉప్పు కూడా వేసి నిమ్మరసం పిండి పక్కన ఉంచాలి.
  • స్టవ్‌మీద బాణలి పెట్టి నూనె వేసి ఆవాలు, మెంతులు, జీలకర్ర వేసి వేయించాలి. తరువాత ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేగాక పెరుగుపచ్చడిలో వేసి కలపాలి. ఈ పచ్చడి అన్నంలోకీ, టిఫెన్లలోకీ కూడా బాగుంటుంది.

0 Comments

కందపచ్చడి

8/29/2013

0 Comments

 
Picture
కావలసిన పదార్థాలు :
కంద-పావుకిలో,

పెరుగు-రెండు కప్పులు
ఉప్పు-తగినంత,

పచ్చిమిర్చి-నాలుగు
ఎండుమిర్చి-నాలుగు,

నూనె-మూడు చెంచాలు
పోపుగింజలు-సరిపడినంత,

పసుపు-చిటికెడు
కరివేపాకు-రెండు రెబ్బలు,

కొత్తిమీర -కొద్దిగా

తయారుచేసే విధానం
  • ముందుగా కందను చెక్కు తీసి ముక్కలుగా కోసి కడిగి ఉడికించాలి. తరువాత చల్లారనిచ్చి మెత్తని గుజ్జుగా కలిపి పక్కన ఉంచుకోవాలి.
  • ఓ గిన్నెలోకి పెరుగు తీసుకుని దానిలో పసుపు, ఉప్పుతో పాటు గుజ్జుగా చేసుకున్న కందను కూడా వేసి బాగా కలియతిప్పాలి.
  • ఇప్పుడు బాణలిలో పోపుగింజల్ని వేయించుకుని పెరుగులో కలుపుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర సన్నగా తరిగిపైన చల్లుకుంటే రుచిగా ఉంటుంది. ఇది అన్నం,చపాతీల్లోకి బాగుంటుంది.

0 Comments
<<Previous

    Author

    నా పేరు సునయన ( ఉరఫ్ నర్మద). సు అంటే "మంచిది" అని, నయన అంటే "నేత్రములు" . సునయన అంటే మంచి కన్నులు కలది అని అర్థం. నా కళ్లతో చూస్తున్న ఈ  మహిళా ప్రపంచాన్ని మీముందు ఉంచాలని, అది మన మహిళాలోకానికి మేలు చేకూర్చాలని ఆశీస్తూ మనలో  ఒక  తెలుగు తరుణిగా నా ఈ చిన్ని ప్రయత్నం. 

    Categories

    All
    ములగ ఆకులు
    చేపల పచ్చడి
    మటన్ పచ్చడి
    వంకాయ
    టమాటా
    నిమ్మ - టొమాటో పచ్చడి
    దోసకాయ
    టొమాటో - పండుమిర్చి పచ్చడి
    పల్లీల చట్నీ
    చికెన్ పచ్చడి
    సొరకాయ పచ్చడి
    అరటికాయ
    రొయ్యలు
    నువ్వుల పచ్చడి
    కొబ్బరి పచ్చడి
    నువ్వులు
    ఉసిరికాయ
    చిక్కుడు ఆవకాయ
    క్యారెట్ పచ్చడి
    ఉల్లిపాయ పచ్చడి
    ఉసిరికాయ పచ్చడి
    మామిడికాయ
    చిలగడదుంప
    కందపచ్చడి
    క్యారెట్‌-కాప్సికమ్‌ పచ్చడి
    చింతచిగురు పొడి
    బీట్‌రూట్‌ పచ్చడి
    క్యాప్సికం పచ్చడి
    ఉసిరిపచ్చడి

    Archives

    January 2014
    December 2013
    November 2013
    October 2013
    September 2013
    August 2013
    July 2013
    June 2013
    May 2013

    RSS Feed

    Enter your email address:

    Delivered by FeedBurner


Powered by Create your own unique website with customizable templates.