బొంబాయిరవ్వ - కప్పు,
పెరుగు - కప్పు,
ఉల్లితరుగు - అర కప్పు,
టొమాటో తరుగు - అర కప్పు,
ఉప్పు - తగినంత,
పచ్చిమిర్చి తరుగు - రెండు టేబుల్ స్పూన్లు,
అల్లం తురుము - టీ స్పూను,
కొత్తిమీర తరుగు - కొద్దిగా,
నూనె - తగినంత
తయారి:
- ఒక గిన్నెలో బొంబాయిరవ్వ, పెరుగు, ఉప్పు వేసి కలపాలి
- ఉల్లితరుగు, టొమాటో తరుగు, పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర తరుగు, అల్లం తురుము జత చేసి బాగా కలిపి సుమారు రెండు గంటలు నాననివ్వాలి
- స్టౌ మీద పెనం ఉంచి కాగాక, నానబెట్టుకున్న పిండిని గరిటెడు తీసుకుని, పెనం మీద మందంగా వేసి, చుట్టూ నూనె వేసి మూత ఉంచాలి
- ఎర్రగా కాలాక రెండవవైపు తిప్పి కాల్చి తీసేయాలి.