టమాటాలు-పావుకిలో
బియ్యం-అరకిలో
నూనె-100గ్రా
పచ్చిమిరపకాయలు-6
ఎండుమిర్చి-నాలుగు
ఆవాలు, జీలకర్ర-ఒక చెంచా చొప్పున
కరివేపాకు-అరకట్ట
శనగపప్పు-రెండు చెంచాలు
మినపప్పు-రెండు చెంచాలు
పల్లీలు-అరకప్పు
పసుపు-చిటికెడు
చింతపండు-100గ్రా.
ఉప్పు-రుచికి సరిపడా
తయారుచేసే విధానం
ముందుగా బియ్యం శుభ్రంగా కడిగి అన్నంగా వండుకుని ఒక పళ్లెంలో పోసి చల్లార్చుకోవాలి. మందపాటి బాణలిలో నూనెపోసి కాగాక పోపు సామానులన్నీ వేసుకుని దోరగా వేయించాలి. ఇందులోనే సన్నగా తరిగిన టమాటాలు, సన్నగా చీల్చిన పచ్చిమిరపకాయలు, పసుపు, ఉప్పు, చింతపండు గుజ్జు వేసి బాగా కలిపి మళ్లీ ఉడికించాలి. బాగా ఉడికిన కూరను చల్లారిన అన్నంలో బాగా కలపాలి. నిమ్మకాయను పిండుకుని కొత్తిమీరతో అలంకరించుకుంటే ఘుమఘుమలాడే టమాట పులిహోర తయారు. దీనిని ఉదయాన్నే అల్పాహారంగా కూడా తీసుకోవచ్చు.