పులిసిన ఇడ్లీ పిండి : ఒక కప్పు
మైదా పిండి : ఒక కప్పు
బియ్యం పిండి : 2 టేబుల్ స్పూన్లు
ఉల్లిపాయలు : 2 పెద్దవి
ఎండుమిరపకాయలు : నాలుగు
ఆవాలు : ఒక స్పూన్
మినపప్పు : 2 స్పూన్లు
పచ్చి సెనగ పప్పు : 2 స్పూన్లు
వంట సోడా : చిటికెడు
నూనె : తగినంత
ఉప్పు : సరిపడా
తయారుచేసే పద్ధతి :
పులిసిన ఇడ్లీ పిండిలో మైదా, బియ్యం పిండి, వంట సోడా, తగినంత ఉప్పు కలుపుకోవాలి. స్టవ్ మీద బాణలి పెట్టి అందులో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి ఆవాలు, మినపప్పు, సెనగ పప్పు, ఉల్లిపాయలు వేసి దోరగా వేయించుకోవాలి. తర్వాత వీటిని ఇడ్లీ పిండి మిశ్రమంలో కలుపుకోవాలి. బాణలిలో నూనె పోసి కాగిన తర్వాత ఇడ్లీ పిండి మిశ్రమాన్ని కావలసిన సైజ్ లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అంతే పులి బొంగరాలు రెడీ. వీటిని అల్లం పచ్చడి, పండు మిరపకాయలు లేదా పచ్చిమిరపకాయల పచ్చడి, ఇడ్లీ పొడితో ఆరగించవచ్చు.
మూలం : సాక్షి