కార్న్‌ఫ్లోర్ - కప్పు,
జొన్నపిండి - అర కప్పు,
గోధుమపిండి - అర కప్పు,
కసూరీమేథీ - 2 టేబుల్ స్పూన్లు,
కొత్తిమీర తరుగు - 3 టేబుల్ స్పూన్లు,
నువ్వులు - టేబుల్ స్పూను,
వాము - టీ స్పూను,
బెల్లం - టీ స్పూను,
ఉప్పు - తగినంత,
పసుపు - పావు టీ స్పూను,
పచ్చిమిర్చి తరుగు - 2 టేబుల్ స్పూన్లు,
అల్లం వెల్లుల్లి పేస్ట్ - టీ స్పూను,
పెరుగు - 3 టేబుల్ స్పూన్లు,
నీరు - కొద్దిగా,
నూనె - డీప్ ఫ్రైకి సరిపడా
తయారి:
ఒక పాత్రలో నూనె, నీరు, పెరుగు మినహా అన్ని పదార్థాలను వేసి బాగా కలపాలి పెరుగు జత చేసి చపాతీ పిండిలా కలిపి చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి పాలిథిన్ కవర్ మీద కొద్దిగా నూనె రాసి ఒక్కో ఉండను దాని మీద ఉంచి, చెక్కవడల మాదిరిగా చేతితో అద్దాలి స్టౌ మీద బాణలి ఉంచి అందులో నూనె పోసి కాగాక, తయారుచేసి ఉంచుకున్న ఒక్కో ధేబ్రా (గుజరాతీ వంటకం) ను వేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించి పేపర్ టవల్ మీదకు తీయాలి ఇవి సుమారు నెలరోజుల వరకు నిల్వ ఉంటాయి.