కొద్దిగా పుల్లగా ఉన్న పెరుగు - రెండు కప్పులు (బాగా చిలకాలి),
శనగపిండి - 2 టీ స్పూన్లు,
కొబ్బరితురుము - టీ స్పూను,
అల్లం వెల్లుల్లి పేస్ట్ - టీ స్పూను,
కొత్తిమీర తరుగు - రెండు టీ స్పూన్లు,
పసుపు - అర టీ స్పూను,
పకోడీల కోసం:
శనగపిండి -పావు కప్పు,
పచ్చిమిర్చి తరుగు - అర టీ స్పూను,
కొత్తిమీర - చిన్న కట్ట,
తినే సోడా - చిటికెడు,
పసుపు - కొద్దిగా,
ఉప్పు - తగినంత,
నూనె - డీప్ ఫ్రైకి సరిపడా,
పోపు కోసం:
నూనె - 2 టేబుల్ స్పూన్లు,
ఎండుమిర్చి - 1 (కట్ చేయాలి),
జీలకర్ర - అర టీ స్పూను,
ఆవాలు - అర టీ స్పూను,
కరివేపాకు - రెండు రెమ్మలు
తయారి:
- ఒక పాత్రలో శనగపిండి, పచ్చిమిర్చి, కత్తిమీర, సోడా, పసుపు, ఉప్పు వేసి తగినంత నీరు పోసి పకోడీల పిండిలా కలుపుకోవాలి
- బాణలిలో నూనె కాగాక ఈ మిశ్రమాన్ని పకోడీలలా వేసి వేయించి గోధుమరంగులోకి వచ్చాక తీసి పక్కన ఉంచాలి
- ఒక పాత్రలో అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు వేసి బాగా కలపాలి
- ఒక చిన్న గిన్నెలో రెండు కప్పుల నీరు, శనగపిండి వేసి ఉండలు లేకుండా బాగా కలిపి వడగట్టాలి
- వేయించిన కొబ్బరితురుము, అల్లంవెల్లుల్లి పేస్ట్ జతచేసి కలిపి స్టౌ మీద ఉంచి మరిగించాలి
- మంట తగ్గించి ఐదు నిముషాలు ఉంచితే పులుసు రెడీ అవుతుంది
- బాణలిలో నూనె కాగాక ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి
- పచ్చిమిర్చి జతచేసి ఒకసారి వేయించాక, మరిగిన పులుసులో వేయాలి
- తయారుచేసి ఉంచుకున్న పకోడీలను పులుసులో వేసి రెండు నిముషాలు ఉడికించి దించేయాలి.