సెనగ పిండి - అరకిలో
గుడ్లు - 10
వేరుసెనగ పప్పు - 250 గ్రా.
ఎండు కొబ్బరి - సగం చిప్ప
ఎండు మిరపకాయలు - 4
నూనె - వేయించడానికి సరిపడా
ఉప్పు - తగినంత
తయారుచేసే పద్ధతి :
- మొదట కోడిగుడ్లను ఉడకబెట్టి, పొక్కులు తీసి పెట్టుకోవాలి. ఎండు కొబ్బరిని తురుమి పెట్టుకోవాలి. వేరుసెనగ పప్పును బాణలిలో వేసి (నూనె లేకుండా) వేయించాలి. తర్వాత పొట్టు తీసి ఎండు మిరపకాయలతో కలిపి రుబ్బుకోవాలి. ఎండు కొబ్బరి తురుమును, మూడు చిటికెల ఉప్పును వేసి మరో సారి రుబ్బుకోవాలి.
- ఆ తర్వాత ఉడికించిన గుడ్డును మధ్య భాగంలో కత్తితో కోసి, అందులో వేరుసెనగపప్పు, ఎండుకొబ్బరి మిశ్రమాన్ని పెట్టాలి.
- ఒక పాత్రలో సెనగపిండి, తగినంత ఉప్పు, ఒక టీస్పూన్ కారం పొడి కలిపి, కావలసినన్ని నీళ్ళు పోసి కాస్త గట్టిగా కలుపుకోవాలి.
- స్టవ్ పై బాణలి పెట్టి, అందులో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేయాలి. నూనె బాగా కాగిన తర్వాత వేరుసెనగపప్పు, ఎండు కొబ్బరి మిశ్రమం పెట్టిన గుడ్లను సెనగపిండిలో ముంచి తీసి కాగుతున్న నూనెలో వేసి వేయించాలి. అంతే నోరూరించే ఎగ్ బోండాలు రెడీ.
మూలం : సాక్షి దినపత్రిక