గోధుమ పిండి - కప్పు
బియ్యప్పిండి - అరకప్పు
సెనగ పిండి - పావుకప్పు
జొన్న పిండి - అరకప్పు
అల్లం - చిన్న ముక్క
వెల్లుల్లి రెబ్బలు - 2
పచ్చిమిర్చి - 3
ధనియాల పొడి - 2 టీస్పూన్లు
కసూరి మెంతి - టీస్పూన్
అవిసె గింజల పొడి - టీస్పూన్
గరం మసాలా - టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
జీలకర్ర - టీస్పూన్
నూనె - వేయించడానికి సరిపడా
కారం - 2 టీస్పూన్లు
పసుపు - అర టీస్పూన్
వాము - అరటీస్పూన్
కొత్తిమీర తురుము - కప్పు
నువ్వులు - 2 టేబుల్ స్పూన్లు
ఉల్లి తురుము - అరకప్పు
తయారుచేసే పద్ధతి:
- అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి మెత్తగా రుబ్బాలి. కొత్తిమీర సన్నగా తరగాలి.
- నువ్వులు, నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ ఓ గిన్నెలో వేసి కలపాలి. తరువాత తగినన్ని నీళ్ళు పోసి చపాతీ పిండిలా కలపాలి.
- ఇప్పుడు పిండి ముద్దను చపాతీ కర్రతో పాలిథీన్ కవర్ మీద గానీ లేదా నున్నని పాలరాయి మీద గానీ నూనె లేదా నెయ్యి అద్దుతూ చపాతీలా చేయాలి. రొట్టె చేసాక గారే మాదిరిగా మద్యలో రంద్రం చేసి పైన నువ్వులు చల్లి నెమ్మదిగా అద్దాలి.
- ఇప్పుడు పెనం మీద ఈ రొట్టె వేసి చిల్లులో అరటీస్పూన్ నూనె వేసి మూతపెట్టాలి. రెండు లేక మూడు నిమిషాల తర్వాత రొట్టెను తిప్పి మళ్లీ అదే మాదిరిగా మధ్యలో పావుటీస్పూన్ నూనె వేసి మూతపెట్టి కాలనివ్వాలి. రెండోవైపు తిప్పిన తర్వాత నువ్వులు గోధుమ రంగులోకి మారగానే రొట్టె తీయాలి. ఇలాగే అన్నీ చేసుకోవాలి. ఇది చాలా రుచిగా ఉండడమే కాక మంచి పోషకాహారం కూడా.
మూలం : ఈనాడు ఆదివారం పుస్తకం