telugutaruni.weebly.com
  • Home
  • వంటకాలు (Cookeries)
    • ఫలహారాలు (Tiffins)
    • శాకాహారం (Veg)
    • బియ్యపు వంటలు (Rice items)
    • మాంసాహారం (Non-Veg)
    • పచ్చళ్ళు (chutneys)
    • వడియాలు
    • పండ్ల రసాలు (Juices)
    • స్వీట్స్ (Sweets)
    • చిరుతిళ్ళు (Snacks)
    • గ్రేవీ ఐటమ్స్
    • సూప్స్ (Soops)
    • కొత్త కొత్తగా
  • చిట్కాలు (Tips)
    • వంటింటి చిట్కాలు ( Kitchen Tips)
    • ఆరోగ్య చిట్కాలు (Health Tips)
    • సౌందర్య చిట్కాలు (Beauty Tips)
  • మహిళా లోకం
    • ఆదర్శ మహిళలు
    • శభాష్ మహిళా..
  • విహారయాత్ర

ఎగ్‌ పరోటా

6/28/2013

0 Comments

 
Picture
కావలసిన పదార్థాలు:
పరోటా                  : రెండు
జీరా, ఉప్పు, మిర్చిపొడి       : సరిపడా
రిఫైండ్‌ ఆయిల్‌      : సరిపడా
గుడ్లు                    : 2
సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు : అరకప్పు
టమోటా ముక్కలు : అరకప్పు
మిరియాల పొడి      : అర టీ స్పూను
ధనియాల పొడి          : అర టీ స్పూను
పసుపు                    : పావు టీ స్పూను
కొత్తిమీర తురుము    : రెండు టేబుల్‌ స్పూన్లు

తయారు చేసే విధానం:
  • ముందుగా కడాయిలో నూనె వేడి చేసి జీరా, ఉల్లిపాయ, టమోటా ముక్కలు వేసి దోరగా వేగ నివ్వాలి. తర్వాత రెండు పరోటాల ముక్కలను వేసి వేయించాలి. మిర్చిపొడి, ఉప్పు, పసుపు, మిరియాల పొడి, ధనియాల పొడి వరుసగా వేసి సన్నని సెగపై ఉడికించాలి. గుడ్ల సొనను చిలి కి కడాయిలో పోసి కలపాలి. గుడ్లు పూర్తిగా ఉడకనిచ్చి పైన కొత్తిమీర తురుము చల్లి వేడి వేడిగా సర్వ్‌ చేయొచ్చు. ఎగ్‌ పరోటాకు చిల్లీ సాస్‌ లేదా టమోటా సాస్‌ను సైడ్‌ డిష్‌గా సర్వ్‌ చేసుకోవచ్చు. 


0 Comments

స్పైసీ వెజిటబుల్ టోస్ట్

6/27/2013

0 Comments

 
Picture
కావలసిన పదార్థాలు :
బ్రెడ్ స్లైసులు          - 4
బంగాళదుంపలు    - 4 (మరీ మెత్తగా కాకుండా ఉడికించాలి)
ఉల్లితరుగు            - పావు కప్పు
క్యాప్సికమ్ తరుగు - పావు కప్పు
టొమాటో తరుగు    - పావు కప్పు
కారం                    - అర టీ స్పూను
చాట్‌మసాలా         - అర టీ స్పూను
ఉప్పు                   - తగినంత
అల్లంతురుము      - టేబుల్ స్పూను
పచ్చిమిర్చి తరుగు  - టేబుల్ స్పూను
కొత్తిమీర తరుగు     - 2 టేబుల్ స్పూన్లు
నూనె                     - వేయించడానికి తగినంత

తయారుచేసే పద్ధతి:
  • ఉడికించిన బంగాళదుంపలను ఒక పాత్రలో వేసి, మెత్తగా చేయాలి.
  • మిగిలిన కూరముక్కలు, మసాలా దినుసులు, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి మరోమారు కలపాలి.
  • ఒక బ్రెడ్ స్లైస్ తీసుకుని గు్రండంగా, దీర్ఘచతురస్రంగా లేదా చతురస్రంగా ఒక్కో స్లైసుని నాలుగు ముక్కలు గా కట్ చేసుకోవాలి.
  • తయారుచేసి ఉంచుకున్న మిశ్రమాన్ని బ్రెడ్‌కి రెండువైపులా ఉంచి చేతితో గట్టిగా అదమాలి.
  • నాన్‌స్టిక్ పాన్‌ను స్టౌ మీద ఉంచి వేడి చేసి, నూనె వేసి కాగాక, బ్రెడ్ స్లైస్ వేసి రెండువైపులా కాల్చాలి. 

మూలం : సాక్షి దినపత్రిక

0 Comments

సొరకాయ తెప్లా

6/26/2013

0 Comments

 
Picture
కావలసిన పదార్థాలు 
 సొరకాయ తురుము     - ఒక కప్పు, 
గోధుమపిండి                - ఒక కప్పు, 
పచ్చిమిర్చి (సన్నగా తరిగి)- ఒకటి,
ఉప్పు                           -ముప్పావు స్పూన్, 
నూనె                            -ఒక టీస్పూన్, 
కొత్తిమీర తురుము        - ఒక టేబుల్ స్పూన్, 
కసూరి మెంతి                 - ఒక టేబుల్‌స్పూన్, 
కారం                             - పావు టీస్పూన్, 
పసుపు                  - రెండు చిటికెలు, 
చాట్ మసాలా         - పావు టీస్పూన్, 
గోధుమ పిండి         - మూడు టేబుల్ స్పూన్‌లు, 
నెయ్యి లేదా నూనె  - రెండు టేబుల్‌స్పూన్‌లు (తెప్లా పైన పూసేందుకు)

తయారుచేసే పద్ధతి :
  •  గోధుమపిండిలో సొరకాయ తురుము, ఉప్పు, పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర తురుము, కసూరిమెంతి, కారం, పసుపు, చాట్ మసాలా, నూనె వేసి ముద్దలా కలపాలి. సొరకాయలో నీళ్లు ఉంటాయి కాబట్టి పిండి కలిపేటప్పుడు ప్రత్యేకించి నీళ్లు పోయనక్కర్లేదు. ఒకవేళ పిండి మరీ జారుగా అయితే మరికొంచెం గోధుమపిండి కలపండి. మెత్తటి ముద్ద తయారుచేసుకున్న తరువాత దాన్నుంచి పది చిన్న చిన్న ఉండలు చేయాలి.
  • ఆ తరువాత రొట్టెల పెనాన్ని వేడి చేయాలి. అది వేడెక్కుతుండగానే గోధుమపిండిలో ఉండల్ని దొర్లించి రొట్టెల కర్రతో నాలుగైదు అంగుళాల వెడల్పులో గుండ్రంగా వత్తాలి. వీటిని వేడెక్కిన పెనం మీద వేసి ఎర్రటి మచ్చలు వచ్చే వరకు కాల్చాలి. ఆ తరువాత రెండో వైపు తిప్పి పైన నూనె పూసి చివర్లను గరిటెతో నొక్కుతూ కాల్చాలి. ఇలానే రెండో వైపు కూడా చేయాలి. రెడీ అయిన తెప్లాలను మీకు నచ్చిన కూర లేదా పచ్చడితో తినొచ్చు. ప్రయాణాల్లో వీటిని వేడివేడి టీతో కలిపి తిన్నా బాగుంటాయి.
 
మూలం : ఆంద్రజ్యోతి దినపత్రిక 

0 Comments

సగ్గుబియ్యం దధ్యోదనం 

6/11/2013

0 Comments

 
Picture
కావలసిన పదార్థాలు :
సగ్గుబియ్యం       -          రెండు కప్పులు 
పెరుగు             -           మూడు కప్పులు 
కరివేపాకు         -           రెండు రెబ్బలు 
కొత్తిమీర తరుగు -           కొద్దిగా 
ఉప్పు              -           తగినంత 
తాలింపు గింజలు -          అన్ని కలిపి చెంచ 
ఎండు మిర్చి      -           ఒకటి 
వేయించిన పల్లీల పొడి -    మూడు చెంచాలు 
                                                                   చక్కెర               -          రెండు చెంచాలు 
                                                                   మిరియాలు        -          అర చెంచ 
                                                                   నూనె                -          రెండు చెంచాలు 

తయారుచేసే పద్ధతి :
  • ముందుగా పొయ్యి మీద బాణలి పెట్టి సగ్గు బియ్యాన్ని నూనె లేకుండానే ఎర్రగా వేయించుకొని వేడి చల్లారాక పెరుగులో కలపాలి. 
  • ఇప్పుడు బాణలిలో నూనె వేడి చేసి తాలింపు గింజలూ, మిరియాలూ, ఎండు మిర్చిని వేయించాలి. ఆ తర్వాత కరివేపాకు కూడా వేయాలి. నిమిషమయ్యాక దింపేసి చల్లారనిచ్చి పెరుగులో వేయాలి. ఆ తర్వాత తగినంత ఉప్పుతో పాటు మిగిలిన పదార్థాలన్నీ ఒక్కొక్కటిగా వేస్తే సరిపోతుంది.

మూలం : ఈనాడు వసుంధర 

0 Comments

మామిడి ఆవడ

6/11/2013

0 Comments

 
Picture
కావలసిన పదార్థాలు :
మినప్పప్పు        -          కప్పు 
పెరుగు               -          రెండు కప్పులు
మామిడికాయ తురుము -  కప్పు 
పచ్చిమిర్చి           -          4
అల్లం                   -          చిన్న ముక్క
జీలకర్ర                 -          టీస్పూన్ 
మిరియాలు           -           టీస్పూన్ 
కరివేపాకు             -            రెండు రెమ్మలు 
క్యారెట్ తురుము    -            టేబుల్ స్పూన్ 
అల్లం పేస్ట్             -             అర టీస్పూన్ 
ఉప్పు                  -             తగినంత
నూనె                   -             వేయించడానికి సరిపడా
తాలింపు గింజలు    -             టీస్పూన్ 
డ్రై ఫ్రూట్స్              -             కొద్దిగా

తయారుచేసే పద్ధతి :
  • మినప్పప్పును సుమారు 4 గంటల సేపు నానబెట్టాలి. 
  • మామిడి తురుములో సరిపడా ఉప్పు కలిపి, కొద్దిసేపు అలాగే ఉంచి, తరువాత మామిడి తురుములో ఉండే నీరంతా గట్టిగా పిండి తీసేయాలి.
  • పెరుగులో అల్లం పేస్ట్, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర తరుగు, కరివేపాకు, క్యారెట్ తురుము, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. 
  • స్టవ్ మీద బాణలి ఉంచి అందులో రెండు చెంచాల నూనె పోసి కాగాక, తాలింపు గింజలను వేసి వేయించి, పెరుగులో కలపాలి.
  • నానబెట్టుకున్న మినప్పప్పును శుభ్రంగా కడిగి గ్రైండర్ లో వేసి గట్టిగా రుబ్బుకోవాలి.
  • మామిడి తురుము, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, మిరియాలు, జీలకర్ర, ఉప్పు వేసి మరో మారు రుబ్బాలి.
  • బాణలిలో నూనె వేసి వేడి అయ్యాక రుబ్బి ఉంచుకున్న పిండిని గారెల్లాగా వేయాలి.
  • వేగిన గారెలను ఒక నిమిషం పాటు నీటిలో ఉంచి తీసి పెరుగులో వేయాలి. డ్రై ఫ్రూట్స్ తురుముతో గార్నిష్ చేసి సర్వ్ చేస్తే మామిడి ఆవడలు రుచిగా ఉంటాయి. 

మూలం : సాక్షి దినపత్రిక 

0 Comments

అటుకుల ఉప్మా

6/11/2013

0 Comments

 
Picture
కావలసిన పదార్థాలు :
అటుకులు            -             ఒక కప్పు 
టమోటాలు           -             50 గ్రా.
ఉల్లిపాయ             -             ఒకటి (పెద్దది)
ఎండుమిరపకాయలు -          రెండు 
అల్లం                   -            చిన్న ముక్క 
నూనె                   -            50 గ్రా.
ఆవాలు                 -            అరటీస్పూన్
జీలకర్ర                 -             అరటీస్పూన్ 
మినప్పప్పు           -             ఒక టీస్పూన్ 
                                                               కరివేపాకు             -             కొంచెం 
                                                                ఉప్పు                  -              తగినంత 

తయారుచేసే పద్ధతి :
  • మొదట ఉల్లిపాయను, టొమాటను ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. 
  • తర్వాత స్టవ్ మీద బాణలి పెట్టి నూనె పోసి కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, కరివేపాకు,(ఇష్టమైతే వేరుసెనగ పల్లీలు కూడా వేసుకోవచ్చు) ఎండుమిరపకాయలు వేసి చిటపటలాడించుకోవాలి. అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి. అనంతరం అల్లం, టమాటో ముక్కలు వేసి మూడు నిముషాలు వేగనివ్వాలి. రెండు కప్పుల నీరు పోసి, తగినంత ఉప్పు చేర్చి మూతపెట్టి మరిగించుకోవాలి. బాగా తెర్లిన తర్వాత అందులో అటుకులు వేసుకోవాలి. చివరగా చిటికెడు పసుపు చేర్చి మూడు నిముషాలు ఉడికించాలి. అంతే రుచికరమైన అటుకుల ఉప్మా రెడీ.

మూలం : సాక్షి దినపత్రిక 

0 Comments

ఎగ్ బోండాలు 

6/10/2013

0 Comments

 
Picture
కావలసిన పదార్థాలు :
సెనగ పిండి      -          అరకిలో 
గుడ్లు              -          10
వేరుసెనగ పప్పు -          250 గ్రా.
ఎండు కొబ్బరి     -          సగం చిప్ప 
ఎండు మిరపకాయలు -   4
నూనె               -             వేయించడానికి సరిపడా 
ఉప్పు              -              తగినంత 

తయారుచేసే పద్ధతి :
  • మొదట కోడిగుడ్లను ఉడకబెట్టి, పొక్కులు తీసి పెట్టుకోవాలి. ఎండు కొబ్బరిని తురుమి పెట్టుకోవాలి. వేరుసెనగ పప్పును బాణలిలో వేసి (నూనె లేకుండా) వేయించాలి. తర్వాత పొట్టు తీసి ఎండు మిరపకాయలతో కలిపి రుబ్బుకోవాలి.   ఎండు కొబ్బరి తురుమును, మూడు చిటికెల ఉప్పును వేసి మరో సారి రుబ్బుకోవాలి. 
  • ఆ తర్వాత ఉడికించిన గుడ్డును మధ్య భాగంలో కత్తితో కోసి, అందులో వేరుసెనగపప్పు, ఎండుకొబ్బరి మిశ్రమాన్ని పెట్టాలి. 
  • ఒక పాత్రలో సెనగపిండి, తగినంత ఉప్పు, ఒక టీస్పూన్ కారం పొడి కలిపి, కావలసినన్ని నీళ్ళు పోసి కాస్త గట్టిగా కలుపుకోవాలి. 
  • స్టవ్ పై బాణలి పెట్టి, అందులో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేయాలి. నూనె బాగా కాగిన తర్వాత వేరుసెనగపప్పు, ఎండు కొబ్బరి మిశ్రమం పెట్టిన గుడ్లను సెనగపిండిలో ముంచి తీసి కాగుతున్న నూనెలో వేసి వేయించాలి. అంతే నోరూరించే ఎగ్ బోండాలు రెడీ.

మూలం : సాక్షి దినపత్రిక 

0 Comments

వెజ్ వడలు 

6/10/2013

0 Comments

 
Picture
కావలసిన పదార్థాలు :
మినప్పప్పు     -          300 గ్రా.
బియ్యం           -           2 టేబుల్ స్పూన్లు 
క్యారెట్            -           100 గ్రా.
బీన్స్              -           100 గ్రా.
పచ్చి బఠానీ     -            100 గ్రా.
ఉల్లిపాయలు     -             5 (పెద్దవి)
పచ్చిమిరపకాయలు -       3
డాల్డా               -            1 స్పూన్ 
అల్లం               -             చిన్న ముక్క 
కొత్తిమీర           -             కొంచెం 
కరివేపాకు         -             కొంచెం 
నూనె               -             వేయించడానికి సరిపడా 
ఉప్పు              -              తగినంత 

తయారుచేసే పద్ధతి :
  • ముందుగా మినప్పప్పులో బియ్యం కలుపుకొని ఒక గంట సేపు నానబెట్టాలి. మరోవైపు క్యారెట్, బీన్స్ ను చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. తర్వాత నానబెట్టిన మినప్పప్పును గ్రైండర్ లో వేసి రెండు నిముషాలు రుబ్బాలి. తర్వాత పచ్చిమిరపకాయలను, అల్లం ముక్క, కొత్తిమీర, కరివేపాకు, తగినంత ఉప్పు వేసి వడలకు కలిపే పిండిలా కలుపుకోవాలి. రుబ్బిన పిండిని ఒక పాత్రలోకి తీసుకొని అందులో తరిగి పెట్టుకున్న క్యారెట్, బీన్స్ ముక్కలను, పచ్చి బఠానీలను, డాల్డాను వేసి బాగా కలపాలి.
  • అనంతరం స్టవ్ మీద బాణలి పెట్టి నూనె వేయాలి.
  • నూనె బాగా కాగిన తర్వాత కూరగాయలు చేర్చిన మినప్పప్పు పిండిని వడలాగా తట్టి కాగుతున్న నూనెలో వేసి బాగా వేయించాలి. ఇంకేముంది నోరూరించే వెజ్ వడలు రెడీ. వీటిని పచ్చి కొబ్బరి చట్నీతో గాని, ఎండు మిరపకాయ చట్నీతో  గాని తినవచ్చు.

మూలం : సాక్షి దినపత్రిక 


0 Comments

రాగి వడలు

6/7/2013

0 Comments

 
Picture
కావలసిన పదార్థాలు :
రాగి పిండి           -            అరకిలో 
సెనగపప్పు         -            100 గ్రా.
జీలకర్ర               -            25 గ్రా.
పచ్చిమిరపకాయలు -         30 గ్రా.
ఉల్లిపాయలు        -            200 గ్రా.
వంట సోడా          -            అరటీస్పూన్ 
కరివేపాకు           -             కొంచెం 
ఉప్పు                -            తగినంత 
                                                                  నూనె                 -            వేయించడానికి సరిపడా 

తయారుచేసే పద్ధతి :
  • మొదట ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలను సన్నగా తరిగి పెట్టుకోవాలి. తర్వాత ఒక వెడల్పాటి పాత్రలోకి రాగి పిండి తీసుకోవాలి.
  • అందులో తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ ముక్కలు, సెనగపప్పు, జీలకర్ర, వంట సోడా, కరివేపాకు, (కావాలనుకుంటే కొంచెం మునుగాకు కూడా వేసుకోవచ్చు) తగినంత ఉప్పు, నీళ్ళు పోసి చపాతీ పిండిలా చేసుకోవాలి. స్టవ్ మీద బాణలి పెట్టి డీప్ ఫ్రై కి సరిపడ నూనె పోసుకొని, అది బాగా కాగాక రాగి పిండి మిశ్రమాన్ని వడలా చేతితో కావలసిన ఆకారంలో తట్టి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే నోరూరించే రాగి వడలు రెడీ. ఇవి రుచిగా ఉండడమే కాక ఆరోగ్యానికి చాలా మంచిది.

మూలం : సాక్షి దినపత్రిక 

0 Comments

ఓట్స్ సగ్గుబియ్యం వడలు 

6/7/2013

0 Comments

 
Picture
కావలసిన పదార్థాలు :
ఓట్స్                -           100 గ్రా.
సగ్గుబియ్యం       -            150 గ్రా. 
బంగాళదుంప     -             ఒకటి 
బియ్యప్పిండి      -             50 గ్రా.
ఉల్లిపాయ          -             ఒకటి 
అల్లం                 -            చిన్న ముక్క
పచ్చిమిర్చి         -            మూడు 
మజ్జిగ               -            తగినంత
                                                                   ఉప్పు                -            తగినంత 
                                                                   నూనె                 -            వేయించడానికి సరిపడా 

తయారుచేసే పద్ధతి :
  • ఉల్లిపాయ, అల్లం, పచ్చిమిర్చిని సన్నగా తరగాలి. 
  • బంగాళదుంపను ఉడికించి పొట్టు  తీసి మెత్తగా చిదమాలి. 
  • సగ్గుబియ్యం, ఓట్స్ ను మజ్జిగలో గంట సేపు నాననివ్వాలి. ఇప్పుడు సగ్గుబియ్యం, ఓట్స్ మిశ్రమంలో చిదిమిన బంగాళదుంప, ఉల్లిపాయ ముక్కలు, అల్లం, పచ్చిమిర్చి ముక్కలు, బియ్యప్పిండి, ఉప్పు వేసి కలపాలి. బాణలిలో నూనె వేసి కాగాక ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న వడల్లా వేసి ఎర్రగా వేయించి తీయాలి. 


మూలం : సాక్షి దినపత్రిక 

0 Comments
<<Previous

    Author

    నా పేరు సునయన ( ఉరఫ్ నర్మద). సు అంటే "మంచిది" అని, నయన అంటే "నేత్రములు" . సునయన అంటే మంచి కన్నులు కలది అని అర్థం. నా కళ్లతో చూస్తున్న ఈ  మహిళా ప్రపంచాన్ని మీముందు ఉంచాలని, అది మన మహిళాలోకానికి మేలు చేకూర్చాలని ఆశీస్తూ మనలో  ఒక  తెలుగు తరుణిగా నా ఈ చిన్ని ప్రయత్నం. 

    Categories

    All
    దహీ కడీ పకోడీస్
    దహీ రింగ్ చాట్
    ఇన్ స్టంట్ దోశ
    ఎగ్ బోండాలు
    రవ్వ దోశ
    రాగి వడలు
    వెజ్ వడలు
    బీట్ రూట్ దోశ
    బీట్ రూట్ వడలు
    థైర్ వెజ్ ఇడ్లీ
    రాగి ముద్ద
    ఎగ్‌ పరోటా
    పోహా ఉప్మా
    లాచా పరాటా
    రాగి ఇడ్లీ
    గోభీ పరాటా
    రవ్వ ఊతప్పం
    చీజ్ టోస్ట్
    వెజ్ టేబుల్ దోశ
    రవ్వ పులిహోర
    టమాట పులిహోర
    తాటి ఇడ్లీలు
    పులి బొంగరాలు
    ఓట్స్
    ఓట్స్ ఇడ్లీ
    బఠానీ పరాటా
    బనానా ఇడ్లీ
    పాలక్ పరాటా
    ఓట్స్ మసాలా రవ్వ దోశ
    ముంబై స్టఫ్డ్ పరాటా
    ఓట్స్ క్యారెట్ థాలిపీట్
    ఓట్స్ వెజిటబుల్ బాత్
    ఓట్స్ సగ్గుబియ్యం వడలు
    ధేబ్రా
    చిల్లీ
    మామిడి ఆవడ
    క్విక్ దోశ
    పెసరట్ దోశ
    బీరకాయ దోసె
    గ్రీన్ పరోటా
    అటుకుల ఉప్మా
    మైసూర్ మసాలా దోశ
    సేమియా పనీర్ బాత్
    కార్న్ ఓట్స్ మసాలా
    సొరకాయ తెప్లా
    సేమియా వంటకాలు
    బీరకాయ ఫ్రిట్టర్స్
    బోండాలు
    అస్సామీ దోశ
    కోకోనట్ దోశ
    అడపిండి వడలు
    మిరియాల వడలు
    మొఘలాయి పరోటా
    పన్నీర్ బ్రెడ్
    పన్నీర్ బుర్జీ
    పన్నీర్ కుల్చా
    బ్రెడ్‌ పెరుగు వడ
    కొబ్బరి పొంగడాలు
    రొట్టెలు
    థాలిపీట్
    స్టఫ్డ్‌ చపాతీలు
    చిలగడదుంప వడ
    ములగాకుతో దోసె
    చిలగడదుంప పూరీ
    చిలగడదుంప పరాఠా
    తీపిఊతప్పం
    మొక్కజొన్న దోశ
    మొక్కజొన్న బోండా
    సగ్గుబియ్యం దధ్యోదనం
    న్యూట్రీషియస్ దోసె
    694d582dbf
    తేనీరు(tea)

    Archives

    May 2014
    January 2014
    December 2013
    November 2013
    October 2013
    September 2013
    August 2013
    July 2013
    June 2013
    May 2013
    April 2013

    RSS Feed

    Enter your email address:

    Delivered by FeedBurner


Powered by Create your own unique website with customizable templates.