అటుకులు- 2 కప్పులు
ఓట్స్- 1 కప్పు
ఉల్లిపాయ - 1
పచ్చిమిర్చి -3
కరివేపాకు- 2 రెబ్బలు
కొత్తిమీర - కొద్దిగా
నిమ్మరసం - 1 టి.స్పూన్
సాంబార్ పొడి- 2 టి.స్పూన్
ఆవాలు, జీలకర్ర- 1/4 టి.స్పూన్
మినప్పప్పు- 1 టి.స్పూన్
పల్లీలు- 2 టి స్పూన్లు
క్యారట్ తరుగు- 2 టి.స్పూన్
ఉప్పు- తగినంత
నూనె - 3 టి.స్పూన్
తయారుచేసే పద్ధతి :
అటుకులను కడిగి జల్లెట్లోవేయాలి. నీరంతా పోయాక సాంబార్ పొడి వేసి కలిపి పెట్టుకోవాలి. పాన్లో నూనె వేడిచేసి ఆవాలు, జీలకర్ర వేసి చిటపట లాడాక మినప్పప్పు, పల్లీలు వేసి వేయించాలి.
తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, క్యారట్ ముక్కలు, ఓట్స్ వేసి మెత్తబడేవరకు బాగా వేయించాలి. ఇం దులో అటుకులు, తగినంత ఉప్పు, సన్నగా తరిగిన కొత్తిమీర వేసి కలిపి మూతపెట్టాలి. అటుకులు మగ్గిన తర్వాత నిమ్మరసం కలిపి వేడిగా సర్వ్ చేయాలి.