చిలగడదుంపలు - పావు కిలో (ఉడికించి తొక్క తీసి బాగా మెదపాలి), బెల్లంతురుము - పావు కప్పు,
గోధుమపిండి - కప్పు,
ఉప్పు - తగినంత,
ఏలకుల పొడి - టీ స్పూను,
నీరు - పిండి కలపడానికి తగినంత.
తయారి:
- ఒక గిన్నెలో కొద్దిగా నీరు, బెల్లంతురుము వేసి గరిటెతో కలిపి, కరిగించి, వడకట్టాలి
- అదే పాత్రలో మెత్తగా చేసిన చిలగడదుంప పేస్ట్, ఏలకులపొడి, గోధుమపిండి వేసి బాగా కలపాలి తగినంత నీరు జత చేసి పూరీ పిండి మాదిరిగా కలిపి అరగంట పాటు పక్కన ఉంచాలి
- పిండిని చిన్న ఉండలుగా చేసి పూరీలు ఒత్తుకోవాలి
- బాణలిలో తగినంత నూనె పోసి కాగాక, ఒక్కో పూరీ వేసి వేయించి తీసేయాలి.