telugutaruni.weebly.com
  • Home
  • వంటకాలు (Cookeries)
    • ఫలహారాలు (Tiffins)
    • శాకాహారం (Veg)
    • బియ్యపు వంటలు (Rice items)
    • మాంసాహారం (Non-Veg)
    • పచ్చళ్ళు (chutneys)
    • వడియాలు
    • పండ్ల రసాలు (Juices)
    • స్వీట్స్ (Sweets)
    • చిరుతిళ్ళు (Snacks)
    • గ్రేవీ ఐటమ్స్
    • సూప్స్ (Soops)
    • కొత్త కొత్తగా
  • చిట్కాలు (Tips)
    • వంటింటి చిట్కాలు ( Kitchen Tips)
    • ఆరోగ్య చిట్కాలు (Health Tips)
    • సౌందర్య చిట్కాలు (Beauty Tips)
  • మహిళా లోకం
    • ఆదర్శ మహిళలు
    • శభాష్ మహిళా..
  • విహారయాత్ర

చిల్లీ, చీజ్ టోస్ట్

9/25/2013

0 Comments

 
Picture
కావలసినవి:

బ్రెడ్ స్లైసులు - 6
చీజ్ - 5 టీ.స్పూ.
పచ్చిమిర్చి - 1
పుదీనా ఆకులు - 6 లేక 8
కొత్తిమీర - కొద్దిగా
మిరియాల పొడి - చిటికెడు
ఉప్పు - తగినంత


చేద్దాం ఇలా:

పుదీనా, పచ్చిమిర్చి, ఉప్పు, మిరియాల పొడి కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి లేదా చీజ్‌లో గ్రీన్ చట్నీ ఉంటే కలుపుకోవచ్చు. ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసి కలిపి ఉంచుకోవాలి. బ్రెడ్ స్లైసుల అంచులు తీసేసి ఈ చీజ్ మిశ్రమాన్ని పలుచగా రాసి ఇంకో బ్రెడ్ స్లైస్ పెట్టి అదమాలి. దానిపైన మళ్లీ ఇంకోసారి చీజ్ మిశ్రమం రాసి ఇంకో బ్రెడ్ స్లైస్ పెట్టి అదమాలి. దీన్ని ఇలాగే ఫ్రిజ్‌లో పెట్టి కావలసినప్పుడు తీసి రెండు ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేయాలి. దీన్ని మరోలా కూడా చేసుకోవచ్చు. చీజ్‌లో కారం పొడి, టమాటా సాస్ కలిపి ఎర్రరంగులో మిశ్రమం చేసుకోవచ్చు. ఇలా చేసినప్పుడు మిరియాల పొడి బదులు కాస్త గరం మాసాలా పొడి వేసుకోవాలి.


0 Comments

సేమియా పనీర్ బాత్

9/23/2013

0 Comments

 
Picture
కావలసిన పదార్థాలు .
సేమియా 1 కప్పు
పనీర్‌ ముక్కలు 3 చెంచాలు
క్యారెట్‌, బీన్స్‌, క్యాబేజీ ముక్కలు పావు కప్పు
ఉప్పు తగినంత
నూనె రెండు చెంచాలు,
గరం మసాలా అరచెంచా
కొత్తిమీర 1 కట్ట

తయారు చేసే విధానం :
ముందుగా గిన్నెలో సగం వరకూ నీళ్లు తీసుకుని సేమియా వేసి ఉడకనివ్వాలి. ఆ తరువాత నీళ్లు వంపేసి సేమియాను ఓ ప్లేట్‌లోకి తీసుకుని ఆరనివ్వాలి. బాణలిలో నూనె వేడి చేసి క్యారెట్‌, బీన్స్‌, క్యాబేజీ ముక్కలు వేయించాలి. 5 నిమిషా లయ్యాక పనీర్‌ ముక్కలు కలిపి తగినంత ఉప్పు, గరంమసాలా చల్లి, చివరగా సేమియా వేసి బాగా కలపాలి. 5 నిమిషాలయ్యాక కొత్తిమీర తురుమును చల్లి దించేయాలి. అంతే నోరూరించే సేమియా పనీర్‌ బాత్‌ రెడీ!


0 Comments

పన్నీర్ బ్రెడ్

9/22/2013

0 Comments

 
Picture
కావలసిన పదార్థాలు :
శాండ్‌విచ్‌ బ్రెడ్‌ ముక్కలు       : పది
పనీర్‌                    : వంద గ్రా.
ఉల్లిపాయ                 : ఒకటి
కారం                    : ఒక టీ.
అల్లం వెల్లుల్లి               : అర టీ.
శెనగపిండి.                : వంద గ్రా.
ఉప్పు                   : తగినంత
మంచినీళ్లు                 : ఒక కప్పు
నూనె                    : సరిపడా
గరంమసాలా               : ఒక టీ.

తయారుచేసే పద్ధతి :

ఉల్లిపాయ, పనీర్‌లను విడివిడిగా సన్నగా తరగాలి. బాణలిలో ఒక టీస్పూన్‌ నూనె వేసి అల్లం వెల్లుల్లి, ఉల్లిముక్కల్ని వేసివేయించాలి. పన్నీర్‌, ఉప్పు, కారం, గరం మసాలా కూడా వేసి ఓ ఐదు నిమిషాలు వేయించి దించి పక్కన ఉంచాలి. బ్రెడ్‌ ముక్కల అంచులు తీసేసీ.. త్రికోణాకారంలో కట్‌ చేసుకోవాలి. విడిగా చిన్న గిన్నెలో చిటికెడు ఉప్పు, కొద్దిగా బియ్యపిండి, తగిన నీళ్లు పోసి గట్టి పేస్టులా చేసి పన్నీర్‌ ముక్కల మిశ్రమంలో కలపాలి.కత్తిరించిన ఓ బ్రెడ్‌ముక్కను తీసుకుని దాని మీద ఈ మిశ్రమాన్ని పలుచగా పూసి పైన మరో బ్రెడ్‌ ముక్క పెట్టి శాండ్‌విచ్‌లా తయారుచేయాలి. ఇలా మొత్తం బ్రెడ్‌ముక్కలని చేసుకుని.. స్టవ్‌మీద బాణలి పెట్టి నూనె కాగాక బ్రెడ్‌ ముక్కలను వేసి ఎర్రగా వేయించి తీసేయాలి. అంతే పనీర్‌ బ్రెడ్‌ రెడీ.. ! వీటిని టమాటో సాస్‌ లేదా చింతకాయ పచ్చడితో తింటే చాలా టేస్టీగా ఉంటాయి.


0 Comments

న్యూట్రీషియస్ దోసె

9/19/2013

0 Comments

 
Picture
కావలసినవి: 
మినప్పప్పు - అరకప్పు;

బార్లీ - అరకప్పు
బియ్యం - కప్పు;

పెసరపప్పు - 2 టేబుల్ స్పూన్లు
శనగపప్పు, సోయాబీన్స్ - అర కప్పు చొప్పున
నానబెట్టిన మెంతులు - టేబుల్ స్పూను
అటుకులు - పావుకప్పు;

జీలకర్ర - 2 టీ స్పూన్లు
ఉప్పు - తగినంత;

చీజ్ తురుము - 50 గ్రా.
కొత్తిమీర - చిన్న కట్ట;

నూనె - కొద్దిగా
క్యారట్ తురుము - 4 టేబుల్ స్పూన్లు
పచ్చిమిర్చి తరుగు - టీ స్పూను; 
ఉల్లితరుగు - పావు కప్పు

తయారి: 
  • అన్నిరకాల పప్పులు, బియ్యం, బార్లీ, సోయాబీన్స్‌ని ఆరు గంటలసేపు నానబెట్టాలి.
  • నీరు వడకట్టి, మిక్సీలో వేసి మెత్తగా చేసి పక్కన ఉంచుకోవాలి.
  • తగినంత నీటిలో అటుకులను పావుగంట సేపు నానబెట్టి, మిక్సీలో వేసి మెత్తగా చేయాలి.
  • రుబ్బి ఉంచుకున్న పిండి మిశ్రమంలో అటుకుల పిండి కలిపి మూడు నాలుగు గంటలు పక్కన ఉంచాలి. జీలకర్ర వేసి కలపాలి.
  • స్టౌ మీద పెనం పెట్టి, వేడయ్యాక పిండిని దోసెలా వేసి, పిండి పచ్చిగా ఉండగానే, పైన క్యారట్ తురుము, ఉల్లి తరుగు, పచ్చిమిర్చి తరుగు కొద్దికొద్దిగా వేసి బాగా కాలాక రెండవవైపు తిప్పి కాల్చి తీసేయాలి.

మూలం : సాక్షి దినపత్రిక

0 Comments

రాగి ఇడ్లీ

9/14/2013

0 Comments

 
Picture
కావలసిన పదార్థాలు :
రాగి పిండి - 2 కప్పులు
ఇడ్లీ రవ్వ - ఒక కప్పు
మినపప్పు - అర కప్పు
మెంతులు - ఒక టీ స్పూన్
ఉప్పు - తగినంత

తయారు చేసే విధానం :
ఇడ్లీ రవ్వ, మెంతులు, మినపప్పు విడివిడిగా 6గంటల పాటు నానబెట్టాలి. మూడు కలిపి మరీ మెత్తగా కాకుండా గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లో రాగి పిండి, కొన్ని నీళ్ళు పోసి మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని కూడా ఆరు గంటల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత ఇడ్లీ ప్లేట్‌కు నూనె రాసి మిశ్రమాన్ని కొద్ది, కొద్దిగా వేయాలి. ఆవిరి మీద పదినిమిషాల పాటు ఉడికించాలి. ఈ ఇడ్లీలను కొత్తిమీర చట్నీతో లాగిస్తే బాగుంటాయి.



0 Comments

తాటి ఇడ్లీలు

9/13/2013

0 Comments

 
Picture
కావలసినవి
పండిన తాటిపండు గుజ్జు- 2 కప్పులు
బియ్యం పిండి- 1 కప్పు
బియ్యం రవ్వ- 1 కప్పు
బెల్లం- 3 టి.స్పూన్లు



తయారుచేసే పద్ధతి :
  • బాగా పండిన తాటిపండు గుజ్జు తీసుకుని అం దులో బియ్యం పిండి, బియ్యం రవ్వ వేసి బాగా కలిపి, అరగంట నానిన తర్వాత బెల్లం తురుము వేసి కలిపి పది నిమిషాలు అలాగే వదిలేయాలి.
  • ఈ మిశ్రమం మరీ పలుచగా కాకుండా, మరీ చిక్కగా కాకుండా మామూలుగా మనం ఇడ్లీ పిండికి చేసినట్టుగా ఉండాలి. అవసరమైతే మరి కొంచెం వరి నూక, వరి పిండి కలుపుకోవచ్చు. తాటి గుజ్జు ఒక రకమైన రుచిలో ఉంటుంది కాబట్టి కాస్త బెల్లం వేయాలి. నానిన పిండితో నూనె రాసిన ఇడ్లీ పాత్రలో వేసి ఆవిరి మీద ఉడికించుకుని, ఎండుమిర్చి లేదా అల్లం పచ్చడితో సర్వ్ చేయాలి.


0 Comments

బనానా ఇడ్లీ

9/11/2013

0 Comments

 
Picture
కావలసిన పదార్థాలు :
రవ్వ - ఒక కప్పు
కొబ్బరి తురుము
- పావు కప్పు
పండిన అరటిపండ్లు - 4
చక్కెర - అరకప్పు
బేకింగ్ సోడా
- అర టీ స్పూన్
నెయ్యి - ఒక టీ స్పూన్
ఉప్పు - తగినంత

తయారు చేసే విధానం:
పండిన అరటిపండ్లను మెత్తగా చిదిమి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో అరటిపండ్ల గుజ్జు, రవ్వ, కొబ్బరి తురుము, ఉప్పు, చక్కెర, బేకింగ్ సోడా అన్నీ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంలో కొద్దిగా నీళ్ళు కలిపి మిక్స్ చేయాలి. ఈ పిండి మరీ మెత్తగా కాకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్‌కు నెయ్యి రాసి, అరటిపండ్లతో చేసిన మిశ్రమాన్ని పోసి 15నిమిషాల పాటు సన్నని మంట మీద ఉడికించాలి. ఇంకేముంది.. బనానా ఇడ్లీ రెడీ! పాలతో కలిపి ఈ ఇడ్లీలు తింటే ఎంతో ఆరోగ్యం!

0 Comments

రవ్వ పులిహోర

9/5/2013

0 Comments

 
Picture
కావలసిన పదార్థాలు :
రవ్వ - ఒక కప్పు,

పచ్చిమిరపకాయలు - 5,
పల్లీలు - పావు కప్పు,
కరివేపాకు - నాలుగు రెమ్మలు,
నిమ్మకాయలు - 2,
ఎండు మిరపకాయలు - 2,
శనగపప్పు - 2 స్పూన్స్,
మినపప్పు - ఒక స్పూన్,
ఆవాలు - అర టీ స్పూన్,
జీలకర్ర - అర టీ స్పూన్,
పసుపు - పావు టీ స్పూన్,
ఉప్పు, నూనె - తగినంత


తయారు చేసే విధానం :
  • రెండు కప్పుల నీళ్ళు మరిగించి అందులో ఉప్పు, పసుపు వేయాలి. దీంట్లో రవ్వ పోసి ఐదు నిమిషాల పాటు ఉడికించాలి. ముద్దలా కాకుండా పొడి, పొడిగా ఉండేట్లుగా చూసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక ప్లేటులో వేసి పక్కన పెట్టాలి.
  • కడాయిలో నూనె పోసి ఆవాలు, జీలక(ర వేగాక పల్లీలు వేసి వేయించాలి. ఆ తర్వాత శనగపప్పు, మినపప్పు వేసి వేగనివ్వాలి. దీంట్లో పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసి రెండు నిమిషాలపాటు కలిపి దించేయాలి. కాస్త చల్లారాక వేయించుకున్న రవ్వలో కలపాలి.
  • ఆ పైన ఈ మిశ్రమంలో నిమ్మరసం, సరిపడినంత ఉప్పు వేయాలి. వేడి.. వేడి.. రవ్వ పులిహోర మీ ముందుంటుంది. దీన్ని రెండుగంటలు అలాగే ఉంచి ఆ తర్వాత తింటే బాగుంటుంది.


0 Comments

మొక్కజొన్న దోశ

9/1/2013

0 Comments

 
Picture
కావలసిన పదార్థాలు
మొక్కజొన్న గింజలు : 4 కప్పులు,

పచ్చిమిర్చి : 4,
అల్లం : చిన్నముక్క,
బియ్యం పిండి : 2 స్పూన్లు,
ఉల్లిపాయ : 2,
ఉప్పు : తగినంత,
నూనె : తగినంత.

తయారుచేసే పద్ధతి :

  • మొక్కజొన్న గింజలు, అల్లం, పచ్చిమిర్చి, ఉప్పు తగినన్ని నీళ్లు పోసి దోసపిండిలా గ్రైండ్ చేసుకోవాలి
  • స్టవ్ మీద పెనం పెట్టి వేడి అయ్యాక మొక్కజొన్న పిండి దోశ వేసుకుని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు చల్లుకుని రెండు వేపులా కాల్చుకోవాలి.


0 Comments

    Author

    నా పేరు సునయన ( ఉరఫ్ నర్మద). సు అంటే "మంచిది" అని, నయన అంటే "నేత్రములు" . సునయన అంటే మంచి కన్నులు కలది అని అర్థం. నా కళ్లతో చూస్తున్న ఈ  మహిళా ప్రపంచాన్ని మీముందు ఉంచాలని, అది మన మహిళాలోకానికి మేలు చేకూర్చాలని ఆశీస్తూ మనలో  ఒక  తెలుగు తరుణిగా నా ఈ చిన్ని ప్రయత్నం. 

    Categories

    All
    దహీ కడీ పకోడీస్
    దహీ రింగ్ చాట్
    ఇన్ స్టంట్ దోశ
    ఎగ్ బోండాలు
    రవ్వ దోశ
    రాగి వడలు
    వెజ్ వడలు
    బీట్ రూట్ దోశ
    బీట్ రూట్ వడలు
    థైర్ వెజ్ ఇడ్లీ
    రాగి ముద్ద
    ఎగ్‌ పరోటా
    పోహా ఉప్మా
    లాచా పరాటా
    రాగి ఇడ్లీ
    గోభీ పరాటా
    రవ్వ ఊతప్పం
    చీజ్ టోస్ట్
    వెజ్ టేబుల్ దోశ
    రవ్వ పులిహోర
    టమాట పులిహోర
    తాటి ఇడ్లీలు
    పులి బొంగరాలు
    ఓట్స్
    ఓట్స్ ఇడ్లీ
    బఠానీ పరాటా
    బనానా ఇడ్లీ
    పాలక్ పరాటా
    ఓట్స్ మసాలా రవ్వ దోశ
    ముంబై స్టఫ్డ్ పరాటా
    ఓట్స్ క్యారెట్ థాలిపీట్
    ఓట్స్ వెజిటబుల్ బాత్
    ఓట్స్ సగ్గుబియ్యం వడలు
    ధేబ్రా
    చిల్లీ
    మామిడి ఆవడ
    క్విక్ దోశ
    పెసరట్ దోశ
    బీరకాయ దోసె
    గ్రీన్ పరోటా
    అటుకుల ఉప్మా
    మైసూర్ మసాలా దోశ
    సేమియా పనీర్ బాత్
    కార్న్ ఓట్స్ మసాలా
    సొరకాయ తెప్లా
    సేమియా వంటకాలు
    బీరకాయ ఫ్రిట్టర్స్
    బోండాలు
    అస్సామీ దోశ
    కోకోనట్ దోశ
    అడపిండి వడలు
    మిరియాల వడలు
    మొఘలాయి పరోటా
    పన్నీర్ బ్రెడ్
    పన్నీర్ బుర్జీ
    పన్నీర్ కుల్చా
    బ్రెడ్‌ పెరుగు వడ
    కొబ్బరి పొంగడాలు
    రొట్టెలు
    థాలిపీట్
    స్టఫ్డ్‌ చపాతీలు
    చిలగడదుంప వడ
    ములగాకుతో దోసె
    చిలగడదుంప పూరీ
    చిలగడదుంప పరాఠా
    తీపిఊతప్పం
    మొక్కజొన్న దోశ
    మొక్కజొన్న బోండా
    సగ్గుబియ్యం దధ్యోదనం
    న్యూట్రీషియస్ దోసె
    694d582dbf
    తేనీరు(tea)

    Archives

    May 2014
    January 2014
    December 2013
    November 2013
    October 2013
    September 2013
    August 2013
    July 2013
    June 2013
    May 2013
    April 2013

    RSS Feed

    Enter your email address:

    Delivered by FeedBurner


Powered by Create your own unique website with customizable templates.