ఓట్స్ - కప్పు
మొక్కజొన్న గింజలు - 3 టీస్పూన్లు
ఎండుమిర్చి - ఒకటి
ఉల్లిపాయలు - రెండు
పచ్చి బఠానీలు - 4 టీస్పూన్లు
కొత్తిమీర, పచ్చిమిర్చి ముద్ద- ఒకటిన్నర టీస్పూన్లు
అల్లం తురుము - అరటీస్పూన్
వెల్లుల్లి - 2 రెబ్బలు
టమాటో, క్యారెట్, క్యాప్సికం, బీన్స్ ముక్కలు - కప్పు
నెయ్యి - టీస్పూన్
జీలకర్ర పొడి - టీస్పూన్
ధనియాల పొడి - టీస్పూన్
కారం - అరటీస్పూన్
అజినమెటో - చిటికెడు
ఉప్పు - రుచికి సరిపడా
మిరియాల పొడి - చిటికెడు
నూనె - 2 టీస్పూన్లు
పోపు కోసం :
జీలకర్ర, సెనగపప్పు, ఆవాలు, మినపప్పు - కొద్దికొద్దిగా
తయారుచేసే పద్ధతి:
- ఫ్రెషర్ పాన్ లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, సెనగపప్పు, ఇంగువ వేసి వేయించాలి. అవి వేగాక ఉల్లి తరుగు వేసి వేయించాలి. తరువాత అల్లం తురుము, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. ఇప్పుడు మొక్కజొన్న గింజలు, ఇతర కూరగాయ ముక్కలన్నీ వేసి కాసేపు వేయించాలి. తరువాత ఒకటిన్నర కప్పుల నీళ్ళు పోసి ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, మిరియాల పొడి, పసుపు వేసి కలపాలి. నీళ్ళు మరిగిన తర్వాత ఓట్లు వేసి కలిపి మూత పెట్టి ఓ విజిల్ రానివ్వాలి. చివరగా నెయ్యి వేసి కలిపితే సరి.
మూలం : ఈనాడు ఆదివారం పుస్తకం