రవ్వ - ఒక కప్పు,
పచ్చిమిరపకాయలు - 5,
పల్లీలు - పావు కప్పు,
కరివేపాకు - నాలుగు రెమ్మలు,
నిమ్మకాయలు - 2,
ఎండు మిరపకాయలు - 2,
శనగపప్పు - 2 స్పూన్స్,
మినపప్పు - ఒక స్పూన్,
ఆవాలు - అర టీ స్పూన్,
జీలకర్ర - అర టీ స్పూన్,
పసుపు - పావు టీ స్పూన్,
ఉప్పు, నూనె - తగినంత
తయారు చేసే విధానం :
- రెండు కప్పుల నీళ్ళు మరిగించి అందులో ఉప్పు, పసుపు వేయాలి. దీంట్లో రవ్వ పోసి ఐదు నిమిషాల పాటు ఉడికించాలి. ముద్దలా కాకుండా పొడి, పొడిగా ఉండేట్లుగా చూసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక ప్లేటులో వేసి పక్కన పెట్టాలి.
- కడాయిలో నూనె పోసి ఆవాలు, జీలక(ర వేగాక పల్లీలు వేసి వేయించాలి. ఆ తర్వాత శనగపప్పు, మినపప్పు వేసి వేగనివ్వాలి. దీంట్లో పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసి రెండు నిమిషాలపాటు కలిపి దించేయాలి. కాస్త చల్లారాక వేయించుకున్న రవ్వలో కలపాలి.
- ఆ పైన ఈ మిశ్రమంలో నిమ్మరసం, సరిపడినంత ఉప్పు వేయాలి. వేడి.. వేడి.. రవ్వ పులిహోర మీ ముందుంటుంది. దీన్ని రెండుగంటలు అలాగే ఉంచి ఆ తర్వాత తింటే బాగుంటుంది.