బీట్ రూట్ - పావుకిలో
సెనగ పప్పు - అరకప్పు
కంది పప్పు - అరకప్పు
మెంతులు - టీస్పూన్
పచ్చిమిర్చి - 5
పసుపు - చిటికెడు
ఇంగువ - చిటికెడు
కరివేపాకు, కొత్తిమీర - కొద్దిగా
కొబ్బరి తురుము - 2 టేబుల్ స్పూన్లు
ఉల్లి తురుము - అరకప్పు
ఉప్పు - తగినంత
నూనె - వేయించడానికి సరిపడా
తయారుచేసే పద్ధతి :
- కంది పప్పు, సెనగ పప్పు, మెంతులు కలిపి అరగంట సేపు నానబెట్టాలి.
- తరువాత నీళ్ళు వంపేసి మెత్తగా రుబ్బాలి. రుబ్బిన తర్వాత పప్పుల మిశ్రమంలో బీట్ రూట్ తురుము, కొబ్బరి తురుము, సన్నగా తరిగిన ఉల్లి తురుము, ఉప్పు, పసుపు, ఇంగువ, కరివేపాకు, కొత్తిమీర వేసి బాగా కలపాలి.
- ఇప్పుడు ఈ మిశ్రమం ముద్దని తీసుకొని చేతిమీదే చిన్న చిన్న వడల్లాగా చేసి కాగిన నూనెలో వేయించి తీయాలి. వీటిని టొమాటో సాస్ తో అద్దుకొని తింటే చాలా రుచిగా ఉంటాయి.
మూలం : ఈనాడు ఆదివారం పుస్తకం