చిలగడదుంపలు - రెండు (ఉడికించి, మెత్తగా మెదిపి),
పుదీనా, కొత్తిమీర - కొద్దిగా,
పచ్చిమిర్చి - నాలుగు (సన్నగా తరిగి),
శెనగపిండి - రెండు టేబుల్‌స్పూన్లు,
నూనె - సరిపడా,
ఉప్పు - రుచికి తగినంత.
తయారీ:
- ఒక టీస్పూన్ నూనెని పాన్‌లో వేడిచేసి మెదిపిన చిలగడదుంపల్ని వేయాలి.
- ఇందులో ఉప్పు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, శెనగపిండి వేసి గరిటెతో కలుపుతూ ఓ నిమిషం పాటు వేగించి స్టవ్ మీద నుంచి దింపి చల్లారనివ్వాలి.
- తరువాత ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న వడల్లా చేసి కాగిన నూనెలో దోరగా వేగించాలి. ఈ వడల్ని పుదీనా చట్నీ లేదా కెచప్‌తో తింటే రుచిగా ఉంటాయి.