బ్రెడ్ స్లైసులు - 6
చీజ్ - 5 టీ.స్పూ.
పచ్చిమిర్చి - 1
పుదీనా ఆకులు - 6 లేక 8
కొత్తిమీర - కొద్దిగా
మిరియాల పొడి - చిటికెడు
ఉప్పు - తగినంత
చేద్దాం ఇలా:
పుదీనా, పచ్చిమిర్చి, ఉప్పు, మిరియాల పొడి కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి లేదా చీజ్‌లో గ్రీన్ చట్నీ ఉంటే కలుపుకోవచ్చు. ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసి కలిపి ఉంచుకోవాలి. బ్రెడ్ స్లైసుల అంచులు తీసేసి ఈ చీజ్ మిశ్రమాన్ని పలుచగా రాసి ఇంకో బ్రెడ్ స్లైస్ పెట్టి అదమాలి. దానిపైన మళ్లీ ఇంకోసారి చీజ్ మిశ్రమం రాసి ఇంకో బ్రెడ్ స్లైస్ పెట్టి అదమాలి. దీన్ని ఇలాగే ఫ్రిజ్‌లో పెట్టి కావలసినప్పుడు తీసి రెండు ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేయాలి. దీన్ని మరోలా కూడా చేసుకోవచ్చు. చీజ్‌లో కారం పొడి, టమాటా సాస్ కలిపి ఎర్రరంగులో మిశ్రమం చేసుకోవచ్చు. ఇలా చేసినప్పుడు మిరియాల పొడి బదులు కాస్త గరం మాసాలా పొడి వేసుకోవాలి.