పెసర పప్పు : ఒక కప్పు
జీలకర్ర : కొద్దిగా
పచ్చిమిర్చి : మూడు
అల్లం ముక్క : చిన్నది
ఉప్పు : తగినంత
తయారుచేసే పద్ధతి :
పెసర పప్పును నాలుగైదు గంటల పాటు నాననిచ్చి నీళ్ళు తీసేసి రుబ్బుకోవాలి. కొద్దిగా జీలకర్ర, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కని మెత్తగా నూరి పిండిలో కలుపుకొని దోశలుగా వేస్తే సరి ఘుఘుమలాడే పెసరట్ దోశ వాహ్వా అంటూ తినేయవచ్చు.
మూలం : ఆదివారం ఆంధ్రప్రభ