మినపప్పు : 100 గ్రా.
పెసర పప్పు : 25 గ్రా.
మిరియాలు : ఒక టీస్పూన్
నూనె : తగినంత
ఉప్పు : సరిపడా
తయారుచేసే పద్ధతి :
మొదట మినపప్పును శుభ్రం చేసుకొని మరీ మెత్తగా కాకుండా నీళ్ళు లేని విధంగా కాస్త గట్టిగా రుబ్బుకోవాలి. మరో వైపు మిరియాలను వక్కలు వక్కలుగా దంచుకోవాలి. తర్వాత గట్టిగా రుబ్బి పెట్టుకున్న మినపప్పులో మిరయాలపొడి, పెసరపప్పు, తగినంత ఉప్పును చేర్చి బాగా కలుపుకొని 10 నిమిషాలపాటు ఊరబెట్టుకోవాలి. అనంతరం కావలసిన సైజ్ లో తడి బట్టఫై వడలు పెట్టుకొని కాగుతున్న నూనెలో వేయించుకోవాలి. అంతే కరకరలాడే మిరియాల వడలు రెడీ. వీటిని చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ ఇష్టంగా ఆరగిస్తారు.
మూలం : సాక్షి