గోధుమ పిండి - రెండు కప్పులు
పాలకూర తురుము - ఒక కప్పు
ఉప్పు - రుచికి సరిపడా
నూనె లేదా వెన్న - వేయించడానికి సరిపడా
నూనె - టేబుల్ స్పూన్
జీలకర్ర - కొద్దిగా
కారం లేదా మిరియాల పొడి - పావు టీస్పూన్
తయారుచేసే పద్ధతి :
- ముందుగా పాలకూరను ఉడికించి నీళ్ళు వంపి చల్లారనివ్వాలి.
- గోధుమ పిండిలో పాలకూర, ఉప్పు, కారం, జీలకర్ర, నూనె వేసి కలపాలి. తరువాత తగినన్ని నీళ్ళు పోసి కలిపి ముద్దలా కలుపుకోవాలి.
- పిండి ముద్దను ఉండలుగా చేసి పరాటల్లా వత్తాలి. తరువాత పెనం మీద వెన్న వేసి చపాతిని రెండు వైపులా కాల్చుకోవాలి.
మూలం : ఈనాడు ఆదివారం పుస్తకం