బాంబినో సేమ్యా : 2 ప్యాకెట్లు
బియ్యం : 3 కప్పులు
కొబ్బరి కోరు : ఒక కప్పు
పెరుగు : అర కప్పు
ఉల్లిపాయలు : 3
లవంగాలు : 8
పచ్చిమిర్చి : 8
జీడిపప్పు : ఒక టీస్పూన్
మసాలా ఆకులు : 5
అల్లం వెల్లుల్లి పేస్ట్ : కొద్దిగా
నెయ్యి, నూనె : తగినంత
యాలకులు : 8
పూదీన : 1 కట్ట
కొత్తిమీర : 1 కట్ట
ఉప్పు : తగినంత
తయారుచేసే పద్ధతి :
ముందుగా ఉల్లిపాయ, పచ్చిమిర్చి సన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. బియ్యాన్ని కడిగి నీరు లేకుండా వడకట్టాలి. పచ్చిమిర్చిని మరీ మెత్తగా కాకుండా మాములుగా నూరి పెట్టుకోవాలి. లవంగాలు, యాలకులు, మసాలా ఆకులు కలిపి మసాలా పొడి కొట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టి కాగాక నెయ్యి,నూనె వేసి జీడిపప్పు, సేమ్యా దోరగా వేయించాలి. తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయముక్కలు, పూదీన, అల్లంవెల్లుల్లి పేస్ట్, కొబ్బరి కోరు, బియ్యం, మసాలా పొడి, ఉప్పు వేసి వేయించి, కొలత ప్రకారం నీళ్ళు పోసి మూత పెట్టాలి. మరో పాత్రలో సేమ్యా, పెరుగు కలిపి ఉంచాలి. రెండు విజిల్స్ రాగానే కుక్కర్ దించి, పెరుగు కలిపిన సేమ్యాలో వేసి కలిపి, సన్నగా తరిగిన కొత్తిమీర జల్లితే సరిపోతుంది.
మూలం : ఆదివారం ఆంధ్రప్రభ