సగ్గుబియ్యం - రెండు కప్పులు
పెరుగు - మూడు కప్పులు
కరివేపాకు - రెండు రెబ్బలు
కొత్తిమీర తరుగు - కొద్దిగా
ఉప్పు - తగినంత
తాలింపు గింజలు - అన్ని కలిపి చెంచ
ఎండు మిర్చి - ఒకటి
వేయించిన పల్లీల పొడి - మూడు చెంచాలు
చక్కెర - రెండు చెంచాలు
మిరియాలు - అర చెంచ
నూనె - రెండు చెంచాలు
తయారుచేసే పద్ధతి :
- ముందుగా పొయ్యి మీద బాణలి పెట్టి సగ్గు బియ్యాన్ని నూనె లేకుండానే ఎర్రగా వేయించుకొని వేడి చల్లారాక పెరుగులో కలపాలి.
- ఇప్పుడు బాణలిలో నూనె వేడి చేసి తాలింపు గింజలూ, మిరియాలూ, ఎండు మిర్చిని వేయించాలి. ఆ తర్వాత కరివేపాకు కూడా వేయాలి. నిమిషమయ్యాక దింపేసి చల్లారనిచ్చి పెరుగులో వేయాలి. ఆ తర్వాత తగినంత ఉప్పుతో పాటు మిగిలిన పదార్థాలన్నీ ఒక్కొక్కటిగా వేస్తే సరిపోతుంది.
మూలం : ఈనాడు వసుంధర