బ్రెడ్ స్లైసులు - 4
బంగాళదుంపలు - 4 (మరీ మెత్తగా కాకుండా ఉడికించాలి)
ఉల్లితరుగు - పావు కప్పు
క్యాప్సికమ్ తరుగు - పావు కప్పు
టొమాటో తరుగు - పావు కప్పు
కారం - అర టీ స్పూను
చాట్‌మసాలా - అర టీ స్పూను
ఉప్పు - తగినంత
అల్లంతురుము - టేబుల్ స్పూను
పచ్చిమిర్చి తరుగు - టేబుల్ స్పూను
కొత్తిమీర తరుగు - 2 టేబుల్ స్పూన్లు
నూనె - వేయించడానికి తగినంత
తయారుచేసే పద్ధతి:
- ఉడికించిన బంగాళదుంపలను ఒక పాత్రలో వేసి, మెత్తగా చేయాలి.
- మిగిలిన కూరముక్కలు, మసాలా దినుసులు, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి మరోమారు కలపాలి.
- ఒక బ్రెడ్ స్లైస్ తీసుకుని గు్రండంగా, దీర్ఘచతురస్రంగా లేదా చతురస్రంగా ఒక్కో స్లైసుని నాలుగు ముక్కలు గా కట్ చేసుకోవాలి.
- తయారుచేసి ఉంచుకున్న మిశ్రమాన్ని బ్రెడ్‌కి రెండువైపులా ఉంచి చేతితో గట్టిగా అదమాలి.
- నాన్‌స్టిక్ పాన్‌ను స్టౌ మీద ఉంచి వేడి చేసి, నూనె వేసి కాగాక, బ్రెడ్ స్లైస్ వేసి రెండువైపులా కాల్చాలి.
మూలం : సాక్షి దినపత్రిక