ఉప్పుడు బియ్యం - కిలో
నువ్వులు - అరకిలో
బెల్లం - పావుకిలో
నూనె, - తగినంత
తయారుచేసే పద్ధతి :
బియ్యాన్ని కడిగి గంటసేపు నానబెట్టాలి. నీళ్ళు వంచేసి పొడిగుడ్డ మీద ఇరవై నిమిషాల పాటు ఆరబెట్టాలి. తడి ఆరిన బియ్యాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దానిలో రెండు కప్పుల నీళ్ళు కలిపి జారుగా ఉండే దోశ పిండిని తయారుచేసుకొని పక్కన పెట్టుకోవాలి. మూకుట్లో నువ్వులు ఎర్రగా అయ్యేవరకు వేయించి బరకగా పొడిచేసి బెల్లంలో కలిపి దోశ వేసుకోవాలి. అది ఎర్రగా కాలాక బెల్లం, నువ్వుల పొడి మిశ్రమాన్ని దాని మీద పరిచి మడిచి పెనం మీద నుంచి తీసేయాలి. తక్కిన దోశలు కూడా అలాగే చేసుకోవాలి.
మూలం: ఆదివారం ఆంధ్రప్రభ