గోధుమ పిండి - మూడు కప్పులు
మైదా పిండి - రెండు కప్పులు
ఉప్పు - అర టేబుల్ స్పూన్
వెన్న లేదా నెయ్యి - ముప్పావు కప్పు
స్టఫింగ్ కోసం :
నూనె - రెండు టేబుల్ స్పూన్లు
అల్లం తురుము - టేబుల్ స్పూన్
పచ్చిమిర్చి - మూడు
ఇంగువ - పావు టీస్పూన్
ఉడికించిన బఠానీలు - రెండున్నర కప్పులు
గరం మసాలా - రెండు టీస్పూన్లు
కారం - పావు టీస్పూన్
ఉప్పు - సరిపడా
నిమ్మరసం - 2 టీస్పూన్లు
బెల్లం తురుము - 2 టీస్పూన్లు
కొత్తిమీర తురుము - కొద్దిగా
నూనె లేదా వెన్న - వేయించడానికి సరిపడా
తయారుచేసే పద్ధతి :
- ముందుగా గోధుమ పిండిలో మైదా, ఉప్పు, నెయ్యి వేసి తగినన్ని నీళ్ళు పోసి కలపాలి. తరువాత పలుచని తడిబట్ట కప్పి పక్కన పెట్టుకోవాలి.
- స్టఫింగ్ కోసం బాణలిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత అల్లం తురుము, పచ్చిమిర్చి వేసి వేయించాలి. తరువాత ఇంగువ వేసి వేగాక మిగిలిన దినుసులన్నీ వేసి రెండు నిముషాలు వేయించి దించాలి. చల్లారిన తర్వాత ముద్దలుగా చేసుకోవాలి.
- గోధుమ పిండి ముద్దను రెండు మీడియం సైజ్ చపాతీల్లాగా చేసుకోవాలి. ఒకదాని మీద స్టఫింగ్ ముద్దను పెట్టి ఇంకొక చపాతిని పెట్టి మూసేయాలి. తరువాత ఓసారి కర్రతో వత్తి నూనె లేదా వెన్న వేస్తూ రెండు వైపులా తక్కువ మంట మీద కాల్చి తీయాలి.
మూలం : ఈనాడు ఆదివారం పుస్తకం