కొబ్బరికోరు-రెండు కప్పులు,
తడిబియ్యం పిండి-రెండున్నర కప్పులు
బెల్లం, పంచదార-కప్పు చొప్పున,
యాలకులు-ఆరు
నూనె-పావుకిలో,
జీడిపప్పు-పావు కప్పు,
నెయ్యి-నాలుగు చెంచాలు
పెరుగు-కప్పు
తయారుచేసే విధానం
- బెల్లానికి నీరు చేర్చి, పొయ్యి మీద పెట్టి కరిగించాలి.
- అందులో కొబ్బరికోరు, పంచదార, బియ్యం పిండి చేర్చి బాగా కలియతిప్పాలి.
- పదార్థం బాగా దగ్గర పడ్డాక నెయ్యి చేర్చి మూతపెట్టాలి. తరువాత పెరుగు వేసి గరిటె జారుగా కలిపి దించేయాలి.
- ఇప్పుడు పెనం వేడి చేసి అరచెంచా నెయ్యి రాసి ఈ పిండిని చిన్నచిన్న అట్లులా వేయాలి. రెండువైపులా కాల్చితే...చాలా రుచిగా ఉంటుంది. లేదంటే...నూనెలో కూడా వేయించుకోవచ్చు.
- అయితే ఈ పిండిని గుంట గరిటెతో తీసుకుని నూనెలో వేయాలి. వేగాక ఇది రెండు పొరలుగా విడిపోతుంది.