మినపప్పు-కప్పు,
ఇడ్లీరవ్వ-రెండు కప్పులు
పెసరపప్పు, పంచదార-అరకప్పు చొప్పున
యాలకులు-రెండు,
ఎండుద్రాక్ష-పది
వేరుశనగపప్పు-అరకప్పు,
సోంపు-అరచెంచా
జామ్-మూడు చెంచాలు,
జీడిపప్పు పలుకులు-ఐదు
పచ్చికొబ్బరికోరు-అరకప్పు
తయారుచేసే విధానం
- మినపప్పు, ఇడ్లీరవ్వ, పెసరపప్పును వేర్వేరుగా నానబెట్టాలి. నానినపప్పును మెత్తగా రుబ్బుకుని అందులో కడిగిన ఇడ్లీరవ్వ కలపాలి.
- నానిన పెసరపప్పును మరోసారి కడిగి నీరు వంపేసి మిక్సీలో మెత్తగా చేసుకోవాలి.
- ఇప్పుడు వేరుశనగపప్పు, జీడిపప్పు, సోంపు, యాలకులు కలిపి మిక్సీలో మెత్తని పొడిలా చేయాలి.
- పొయ్యిమీద బాణలి పెట్టి అరకప్పు నీళ్లు మరిగించాలి. ఆ నీటిలో పంచదార కరిగించి రుబ్బి పెట్టుకున్న పెసరపప్పు ముద్ద, వేరుశనగపప్పు పొడి, పచ్చికొబ్బరి తురుము వేసి ఉడికించాలి.
- ఆ తరువాత ఎండుద్రాక్ష, జామ్ కూడా చేర్చి బాగా కలపాలి. మిశ్రమం దగ్గర పడ్డాక దింపేయాలి.
- ఇప్పుడు మరీ లోతుగా లేని కుక్కర్ గిన్నెలో చెంచా నెయ్యి రాసి మినపప్పు మిశ్రమాన్ని రెండు గరిటెలు వేసి, సిద్ధం చేసి పెట్టుకున్న పెసరపప్పు మిశ్రమాన్ని తీసుకుని ఈ పిండిపై పరిచి పైన మరో రెండు గరిటెలు మినప్పిండి వేయాలి.
- సన్నటిమంటపై ఉంచి, మూతపెట్టేసి పదినిమి షాలు ఉడకనివ్వాలి. ఆ తరువాత తీసేసి మనకిష్టమైన ఆకృతిలో ముక్కలుగా కోసుకోవాలి. స్కూలు పిల్లలు లంచ్ బాక్సులలోకి ఇది చాలా బాగుంటుంది.
దీనిలో పోషకాలు
శక్తి-340 కేలరీలు,
ఎదుగుదల కోసం మాంసకృత్తులు- 16,5గ్రా,
శరీరానికి శక్తి ఎముకల ఆరోగ్యం కోసం కార్బొహేడ్రేట్లు-25గ్రా.
కొవ్వు -11గ్రా.