బీట్ రూట్ ముక్కలు - 2 కప్పులు
బియ్యప్పిండి - కప్పు
మైదా పిండి - 2 టేబుల్ స్పూన్లు
జీలకర్ర - పావుటీస్పూన్
ఉప్పు - తగినంత
నూనె - కాల్చడానికి సరిపడా
తయారుచేసే పద్ధతి :
- మందపాటి గిన్నెలో బీట్ రూట్ ముక్కలు, జీలకర్ర, తగినన్ని నీళ్ళు పోసి ముక్కలు మెత్తగా ఉడికించాలి.
- తరువాత నీళ్ళు వంపేసి ముక్కలను మిక్సీలో వేసి మెత్తగా రుబ్బాలి. ఈ రుబ్బిన మిశ్రమంలో బియ్యప్పిండి, మైదా పిండి, ఉప్పు వేసి కలపాలి.
- స్టవ్ మీద నాన్ స్టిక్ పెనం పెట్టి బీట్ రూట్ పిండిని గరిటెతో తీసుకొని పెనం మీద వేసి దోసెలాగా వేసి నూనె వేస్తూ రెండువైపులా కాల్చి తీయాలి. ఇలాగే అన్నీ వేసి వేడివేడిగా ఏదైనా చట్నీతో అందించాలి.
మూలం : ఈనాడు ఆదివారం పుస్తకం