పండిన తాటిపండు గుజ్జు- 2 కప్పులు
బియ్యం పిండి- 1 కప్పు
బియ్యం రవ్వ- 1 కప్పు
బెల్లం- 3 టి.స్పూన్లు
తయారుచేసే పద్ధతి :
- బాగా పండిన తాటిపండు గుజ్జు తీసుకుని అం దులో బియ్యం పిండి, బియ్యం రవ్వ వేసి బాగా కలిపి, అరగంట నానిన తర్వాత బెల్లం తురుము వేసి కలిపి పది నిమిషాలు అలాగే వదిలేయాలి.
- ఈ మిశ్రమం మరీ పలుచగా కాకుండా, మరీ చిక్కగా కాకుండా మామూలుగా మనం ఇడ్లీ పిండికి చేసినట్టుగా ఉండాలి. అవసరమైతే మరి కొంచెం వరి నూక, వరి పిండి కలుపుకోవచ్చు. తాటి గుజ్జు ఒక రకమైన రుచిలో ఉంటుంది కాబట్టి కాస్త బెల్లం వేయాలి. నానిన పిండితో నూనె రాసిన ఇడ్లీ పాత్రలో వేసి ఆవిరి మీద ఉడికించుకుని, ఎండుమిర్చి లేదా అల్లం పచ్చడితో సర్వ్ చేయాలి.