కావలసిన పదార్ధాలు:
బియ్యం నూకలు : 500 గ్రా.
రాగి పిండి : 400 గ్రా.
ఉప్పు : తగినంత
తయారు చేసే విధానం:
- రాత్రి నూకలను నీళ్లలో వేసి నానపెట్టుకోవాలి.
- ఉదయం నానిన నూకలకు నీరు బాగా చేర్చి స్టౌ పై పెట్టి బాగా ఉడికించాలి. నూకలు బాగా ఉడికి జావలా అవుతాయి.
- తరువాత స్టౌ మీద నుండి గిన్నె దించి రాగి పిండిని బాగా కలపాలి. ఈ కలిపేటప్పుడు పిండి ముద్దలుముద్దలుగా ఉండకూడదు.
- మొత్తం రాగిపిండి జావలో కలిసిపోయి ముద్దగా అవతుంది. ఇపుడు రాగిముద్ద తయారైనట్లే.