పెసరపప్పు, మినప్పప్పు, కందిపప్పు,సెనగపప్పు - అరకప్పు చొప్పున
ఎండుమిరపకాయలు - 7
బియ్యం - కప్పు
మెంతులు - అరటీస్పూన్
పసుపు - పావుటీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
జీలకర్ర - అర టీస్పూన్
బ్రెడ్ పొడి - 2 టీస్పూన్లు
బేకింగ్ సోడా - అరటీస్పూన్
నూనె - వేయించడానికి సరిపడా
తయారుచేసే పద్ధతి:
- పప్పులన్నీ ఓ గిన్నెలో వేసి రాత్రంతా నానబెట్టాలి. మెంతులు, ఎండుమిరపకాయ ముక్కలు విడిగా ఓ గిన్నెలో నానబెట్టుకోవాలి.
- ఉదయాన్నే నానబెట్టిన వాటికి ఒక కరివేపాకు రెమ్మ జోడించి మిక్సీలో వేసి రుబ్బాలి. అవసరమైతే కొద్దిగా నీళ్ళు చిలకరించుకోవాలి. తరువాత బేకింగ్ పౌడర్, బ్రెడ్ పొడి, జీలకర్ర, పసుపు వేసి కలిపి చిన్న చిన్న వడల్లాగా చెస్ కాగిన నూనెలో వేయించి తీయాలి. వీటిని కొత్తిమీర పచ్చడితో తింటే చాలా రుచిగా ఉంటాయి.
మూలం : ఈనాడు ఆదివారం పుస్తకం