గోధుమ పిండి : ఒక కప్పు
బియ్యప్పిండి : ఒక కప్పు
మైదా పిండి : ఒక కప్పు
రవ్వ : ఒక కప్పు
క్యారెట్ కోరు : అర కప్పు
ఆలూ కోరు : అర కప్పు
ఉల్లిపాయలు ముక్కలు : అర కప్పు (సన్నగా తరగాలి)
పచ్చిమిర్చి : ఆరు
అల్లం ముక్కలు : కొద్దిగా
కొత్తిమీర : కొద్దిగా
పంచదార : ఒక స్పూన్
తయారుచేసే పద్ధతి :
మొదట గోధుమ పిండి, బియ్యప్పిండి, మైదాపిండి, రవ్వను బాగా కలుపుకోవాలి. అందులో కడిగి తురిమిన క్యారెట్ కోరు, ఆలూ కోరు, ఉల్లిపాయ ముక్కలు తీసుకొని కలుపుకోవాలి. పచ్చిమిర్చి, అల్లం ముక్కలను మెత్తగా రుబ్బుకొని దానిలో కలపాలి. తర్వాత తరిగిన కొత్తిమీర, పంచదార వేసి తగినన్ని నీళ్ళు కలుపుకొని దోశలు వేసుకోవాలి. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం..
మూలం : ఆదివారం ఆంధ్రప్రభ