గోధుమ పిండి - 4 కప్పులు
కాలీఫ్లవర్ తురుము - 2 కప్పులు
కొత్తిమీర తురుము - కొద్దిగా
పచ్చిమిర్చి - రెండు
అల్లం - అంగుళం ముక్క
ఉప్పు - సరిపడా
కారం - తగినంత
గరం మసాలా - రుచి కోసం కొద్దిగా
వాము - అరటీస్పూన్
నూనె లేదా వెన్న - సరిపడా
తయారు చేసే పద్ధతి:
గోధుమ పిండిలో తగినన్ని నీళ్ళు పోసి పిండిముద్దలా కలుపుకోవాలి. ఒక గిన్నె తీసుకొని అందులో కాలీఫ్లవర్ తురుము, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అల్లం తురుము, కొత్తిమీర తురుము, వాము, ఉప్పు, గరం మసాలా అన్నీ కలపాలి. మీడియం సైజ్ చపాతీలు రెండు చేయాలి. ఒకదానిమీద కాలీఫ్లవర్ మిశ్రమాన్ని ఉంచి రెండో చపాతీని దానిమీద పెట్టి మూసేయాలి. ఇపుడు దీన్ని మళ్లీ ఒకసారి కర్రతో ఒత్తి తక్కువ మంట మీద రెండు వైపులా కాల్చి తీయాలి.
మూలం : ఈనాడు ఆదివారం