పాలు లేకుండా చేసేదే బ్లాక్ టీ. ఇది రక్తం గడ్డకట్టనీయదు. తద్వారా గుండెపోటును నియంత్రిస్తుంది. ఉదర, పేగు, రొమ్ము క్యాన్సర్లు రావడం తగ్గుతుందని పరిశోధకుల భావన. ఇది వాపులను తెచ్చే జన్యు ప్రభావాన్ని అడ్డుకుంటుంది. సూక్ష్మ జీవులను సంహరించగల శక్తి కలది. ముక్యముగా చర్మ వ్యాధులు, విరేచనాలు, న్యుమేనియా కారక సూక్ష్మ జీవులను సమర్ధతతో నిరోధిస్తుంది.
తయారుచేసే పద్ధతి :
పాలు లేకుండా చేసేదే బ్లాక్ టీ. ఇది రక్తం గడ్డకట్టనీయదు. తద్వారా గుండెపోటును నియంత్రిస్తుంది. ఉదర, పేగు, రొమ్ము క్యాన్సర్లు రావడం తగ్గుతుందని పరిశోధకుల భావన. ఇది వాపులను తెచ్చే జన్యు ప్రభావాన్ని అడ్డుకుంటుంది. సూక్ష్మ జీవులను సంహరించగల శక్తి కలది. ముక్యముగా చర్మ వ్యాధులు, విరేచనాలు, న్యుమేనియా కారక సూక్ష్మ జీవులను సమర్ధతతో నిరోధిస్తుంది.
0 Comments
తయారుచేసే పద్ధతి :
యాలకులు తొక్కతో పాటు కలిపి పొడి చేసి టీ పొడి తో పాటు మరిగించాలి. ఉత్త తొక్కలు కూడా వేయొచ్చు. మంచి సువాసనగల ఈ టీ రుచి అమోఘం. అప్పుడప్పుడు అల్లం, యాలకులు కలిపి కూడా టీ చేసుకోవచ్చు. తయారుచేసే పద్ధతి :
అల్లం కడిగి, పొట్టు తీసి చిన్న ముక్కను దంచి టీ మరుగుతున్నపుడు వేయాలి. ఈ టీ తాగితే జీర్ణక్రియ మెరుగవుతుంది. కీళ్ళ నొప్పుల ఉపశమనానికి కూడా మంచిది. తల తిరుగుడు ఉపిరితిత్తుల్లో కఫం వంటి ఇబ్బందుల నుండి కూడా బయట పడేస్తుంది ఈ అల్లం టీ... తయారుచేసే పద్ధతి :
టీ పొడి వేసి నీళ్ళు మరిగించండి. దింపి మూత పెట్టండి. అది చల్లారి, చిక్కటి డికాక్షన్ తయారయ్యాక వడగట్టండి. ఇప్పుడు ఇందులో నిమ్మరసం చేర్చండి. తర్వాత తగినంత చక్కర వేసి బాగా కలపండి. ఐస్ ముక్కలు వేసి చల్లగా సర్వ్ చేయండి. ఇందులో పాలు కలపాల్సిన పని లేదు. తలనొప్పి, జ్వరం ఉన్నపుడు ఈ లెమన్ టీ తాగడం వల్ల ఉపశమనం కలుగుతుంది. తయారుచేసే పద్ధతి :
టీ తాగే అలవాటు ఉన్నవారికి చాక్లెట్ రుచి కావాలంటే టీ మరిగేటప్పుడు మీకు కావలసిన కోకో పౌడర్ కలపండి. ప్రత్యేకమైన రుచి గల టీ రెడీ.. తయారుచేసే పద్ధతి :
ముందుగా కడిగి, సన్నగా తరిగిన పూదీన ఆకులు వేసి నీరు మరిగించండి. పిమ్మట టీ పొడి, పాలు, చక్కర వేసి మరిగించండి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. తయారుచేసే పద్ధతి :
టీ కోసం నీరు మరిగించేటపుడు తాజా గులాబీ రేకులు వేసి మూతపెట్టి మరిగించండి. కొద్దిసేపటి తరువాత టీ పొడి, పాలు, చెక్కర వేసి మరిగించండి. మంచి సువాసనతో కూడిన గులాబీ టీ రెడీ... తయారుచేసే పద్ధతి :
లవంగాలు, దాల్చినచెక్క, యాలకులు, శొంటి కొద్ది కొద్దిగా తీసుకొని పొడి చేసి డబ్బాలో వేసి పెట్టుకోండి. టీ చేసేటపుడు టీ పొడితో పాటు ఈ మసాలా పొడి కొద్దిగా వేసి మరిగించండి. తర్వాత పాలు, చక్కర కలపాలి. ఇది మంచి ఘాటు అయిన సువాసన ఇస్తుంది. ఈ మసాలా దినుసులన్నీ వేసి డికాక్షన్ బాగా మరిగించినందున ఆ దినుసుల్లోని రసాయనాలు టీ లో చేరతాయి.దాల్చినచెక్క రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. జీర్ణక్రియ మెరుగవుతుంది. అంటు వ్యాదులనుండి కాపాడుతుంది. |