గోధుమ పిండి - రెండు కప్పులు
నెయ్యి - సరిపడా
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - టేబుల్ స్పూన్
తయారుచేసే పద్ధతి :
- ముందుగా గోధుమ పిండిలో ఉప్పు, నూనె, తగినన్ని నీళ్ళు పోసి ముద్దలా చేసి తడిబట్ట కప్పి అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి.
- పిండిని ఉండలుగా చేసి ఐదారు అంగుళాల చపాతీల చేయాలి. ఇప్పుడు కరిగించిన నెయ్యిని చపాతీ మీద మొత్తంగా రాయాలి. తరువాత చాకుతో రెండున్నర అంగుళాల వెడల్పుతో పొడవుగా కోయాలి. వీటన్నింటిని ఒకదాని మీద ఒకటి పరచాలి. అలా పరిచేటప్పుడు ప్రతీ దాని మీద నెయ్యి వేయాలి. ఇలా పరిచిన దానిని ఒకవైపు నుండి గుండ్రంగా చుట్టాలి. ఇప్పుడు దీన్ని కర్రతో పరాటాలా వత్తాలి. ఇప్పడు స్టవ్ మీద పెనం పెట్టి వెన్న వేస్తూ తక్కువ మంటతో రెండువైపులా కాల్చి తీయాలి.
మూలం : ఈనాడు ఆదివారం పుస్తకం