ఓట్స్ - కప్పు
మొక్కజొన్న గింజలు - కప్పు
నెయ్యి - టీస్పూన్
జీలకర్ర పొడి - అరటీస్పూన్
ధనియాల పొడి - అరటీస్పూన్
కారం - అరటీస్పూన్
అజినమెటో - చిటికెడు
ఉప్పు - రుచికి సరిపడా
సోయాసాస్ - టీస్పూన్
నిమ్మరసం - టీస్పూన్
నూనె - 2 టీస్పూన్లు
తయారుచేసే పద్ధతి:
- బాణలిలో నెయ్యి వేసి కరిగిన తర్వాత ఓట్లు వేసి వేయించాలి. అవి మంచి వాసనా వస్తుండగా తీసి ప్లేటులో పక్కన ఉంచాలి.
- అదే బాణలిలో కొద్దిగా నూనె వేసి మొక్కజొన్న గింజలు వేసి వేయించాలి. తర్వాత మసాలా పొడులన్నీ వేసి కలపాలి. ఇప్పుడు ఓట్లు కూడా వేసి తగినన్ని నీళ్ళు పోసి ఓ రెండు నిముషాలు ఉడికించాలి. మంచి వాసనా వస్తుండగా దించి నిమ్మరసం పిండాలి.
మూలం : ఈనాడు ఆదివారం పుస్తకం