ఉడికించిన బంగాళాదుంపల ముద్ద - 2 కప్పులు
బ్రెడ్ పొడి - అరకప్పు
ఉప్పు - తగినంత
స్టఫింగ్ కోసం :
ఉడికించిన పచ్చి బఠానీల ముద్ద - ఒక కప్పు
తరిగిన పుదీనా - ఒక కప్పు
తరిగిన కొత్తిమీర - ఒక కప్పు
పచ్చిమిర్చి ముక్కలు - ఒక టేబుల్ స్పూన్
నిమ్మరసం, చక్కర - తగినంత
తయారుచేసే పద్ధతి :
బంగాళాదుంపల ముద్దకి ఉప్పు చేర్చి కలపాలి. ఈ ముద్దను నాలుగు సమాన భాగాలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇపుడు స్టఫింగ్ కోసం కావాల్సిన పదార్థాలన్నీ బాగా కలపాలి. వీటిని నాలుగు సమాన భాగాలూ చేసి ఉండలు చేయాలి. వీటిని బంగాళాదుంప ముద్ద లోపల పెట్టి బొండాల్లా చేయాలి. తర్వాత వాటిపైన బ్రెడ్ పొడిని అద్ది కాగిన నూనెలో బంగారు రంగు వచ్చేవరకు వేయిస్తే సరిపోతుంది.
మూలం: ఆదివారం ఆంధ్రప్రభ