గోధుమ పిండి - రెండు కప్పులు
నెయ్యి - అరటీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - సరిపడా
స్టఫింగ్ కోసం :
పెసరపప్పు - 2 టేబుల్ స్పూన్లు(రాత్రే నానబెట్టి నీళ్ళు వంపేయాలి)
ఉల్లికాడల తురుము - 2 టేబుల్ స్పూన్లు
కారం - అరటీస్పూన్
జీలకర్ర - అరటీస్పూన్
ఇంగువ - పావు టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
తయారుచేసే పద్ధతి :
- ముందుగా గోధుమ పిండిలో ఉప్పు, నెయ్యి, టీస్పూన్ నూనె, తగినన్ని నీళ్ళు పోసి ముద్దలా చేసి పది నిముషాలు పక్కన పెట్టుకోవాలి.
- స్టఫింగ్ కోసం తీసుకున్నవన్ని ఓ గిన్నెలో వేసి ముద్దలా కలుపుకొని నాలుగు భాగాలుగా చేయాలి. గోధుమ పిండి ముద్దని కూడా నాలుగు భాగాలుగా చేయాలి.
- ఓ ముద్దను తీసుకొని చిన్న చపాతీలాగా వత్తాలి. అందులో స్టఫింగ్ కోసం తీసుకున్న ముద్దను ఉంచి చుట్టూ అంచులను మూసేయాలి. ఇప్పుడు దీన్ని మళ్లీ కర్రతో కాస్త నెయ్యి లేదా పిండి అద్దుతూ వత్తాలి.
- ఇలాగే అన్ని చేసుకొని పెనం మీద నెయ్యి వేస్తూ రెండు వైపులా కాల్చి తీయాలి.
మూలం : ఈనాడు ఆదివారం పుస్తకం