బియ్యం పిండి : మూడు కప్పులు
నువ్వులు : తగినన్ని
ఉప్పు : అర చెంచాడు
తయారుచేసే పద్ధతి :
ఒక వెడల్పాటి గిన్నెలో పిండి పోసి పెట్టుకోవాలి. మరొక గిన్నెలో మూడు కప్పుల నీళ్ళు పోసి బాగా వేడి చేయాలి. నీళ్ళు మరిగాక పిండిలో పోసి బాగా కలిపి మూతపెట్టుకోవాలి. కాసేపయ్యాక చల్లటి నీళ్ళతో తడి అద్దుకుంటూ పిండిని ముద్దగా చేసుకోవాలి. దానికి నువ్వులను అద్ది (రెండు వైపులా పక్కలకు కూడా నువ్వులు పట్టేలా) పొడి పిండి తీసుకొని రొట్టెలాగా చేతితో పెద్దగా చేసుకోవాలి. వేడైన పెనంపై వేసి ఒకటి లేక రెండు నిమిషాలయ్యాక నీళ్ళు చల్లి కొద్దిసేపయ్యాక తిప్పి వేసి కాలిన తర్వాత తీయాలి. అంతే ! నువ్వుల రొట్టెలు తయార్ ! పల్లీల చట్నీ, నువ్వుల చట్నీ, సోయా చిక్కుడు కూరలతో తింటే చాలా రుచిగా ఉంటుంది.
మూలం : నమస్తే తెలంగాణ ఆదివారం పుస్తకం