బియ్యం - ముప్పావు కప్పు
కంది పప్పు - పావు కప్పు
ఎండుమిరపకాయలు - 4-6
కొబ్బరి తురుము - అరకప్పు
చింతపండు - కొద్దిగా
ములగాకు - ఒక కట్ట
ఇంగువ - ఒక టీస్పూన్
ఉప్పు - తగినంత
తయారుచేసే పద్ధతి :
బియ్యం, కందిపప్పు కలిపి రెండు గంటలు నానబెట్టాలి. కొబ్బరి, ఎండుమిరపకాయలు, చింతపండు మెత్తగా రుబ్బుకోవాలి. నానబెట్టిన బియ్యం, పప్పుల్ని, మరీ మెత్తగా కాకుండా మాములుగా రుబ్బుకోవాలి. ఉప్పు, ఇంగువ పిండిలో వేసి బాగా కలియబెట్టాలి. అందులో ములగాకులు కలపాలి. అరగంటపాటు పిండిని అలా వదిలేస్తే మునగాకులు బాగా నానుతాయి. పెనం వేడి చేసి కొంచెం మందంగా దోసె వేసుకోవాలి. చుట్టూ కొద్దిగా నూనె జల్లి, రెండు వైపులా కాలనివ్వాలి. దీనిని ఊరగాయ లేదా చట్నీ నంజుకొని తింటే ఎంతో రుచిగా ఉంటుంది.
మూలం : స్వాతి సపరివార పత్రిక