మైదాపిండి - 2 కప్పులు
నెయ్యి - 3 స్పూన్లు
గుడ్లు - 4
నూనె, ఉప్పు - తగినంత
తయారుచేసే పద్ధతి :
స్టఫింగ్ కోసం :
నూనెలో ఉల్లిపాయ ముక్కలు వేసి వేగిన తర్వాత కరివేపాకు వేసి మంట తగ్గించి స్టఫింగ్ కోసం వాడే పదార్థాలన్నీ వేయాలి. సన్నని సెగమీద మూడు నిమిషాలుంచి తరువాత సెగ పెంచి మరో మూడు నిముషాలు ఉంచాలి. ఆనక దించి పక్కన పెట్టుకోవాలి.
పరోటాల తయారీ :
పరోటాలకు ఉపయోగపడే పదార్థాలను అన్నింటిని కలిపి ముద్దగా చేసి ఆరు భాగాలుగా కట్ చేసుకోవాలి. ఒక్కో భాగాన్ని గుండ్రంగా చేసుకోవాలి. పెనంపై కనీసం రెండు కప్పుల నూనె పోసి వేడిచేయాలి. తరువాత గుడ్లను పగలకొట్టి కొంత సొనను పోసి పరోటాను దానిపై వేయాలి. ఇందులో కొంచెం ఫిల్లింగును ఉంచి మూసేసి సన్నని సెగపై పరోటాను నాలుగు నిమిషాలుంచాలి. చివర్లు మూసేటప్పుడు స్క్యెర్ ఆకారం వచ్చేలా చూసుకోవాలి. నెమ్మదిగా పరోటాను తిప్పి రెండో పక్క కూడా సన్నని సేగామీదే గోధుమరంగు వచ్చే వరకు కాల్చాలి. వీటిని చట్నీ తో తింటే రుచిగా ఉంటుంది.
మూలం: ఆదివారం ఆంధ్రప్రభ