ఓట్స్ - కప్పు(మెత్తని పొడిలా చేయాలి)
బొంబాయి రవ్వ - అరకప్పు
బియ్యప్పిండి - పావు కప్పు
మైదా పిండి - 2 టీస్పూన్లు
అల్లం వెల్లుల్లి - టీస్పూన్
మిరియాల పొడి - అర టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
జీలకర్ర - టీస్పూన్
నూనె - వేయించడానికి సరిపడా
కారం - టీస్పూన్
ధనియాల పొడి - టీస్పూన్
కరివేపాకు - ఒక రెమ్మ
తయారుచేసే పద్ధతి:
- ఓ గిన్నెలో అన్నీ పదార్థాలు వేసి కలపాలి. తరువాత తగినన్నీ నీళ్ళు పోసి ఉండలు కట్టకుండా దోశ పిండి మాదిరిగా కలపాలి. ఇప్పుడు పెనం మీద పిండిని పలుచగా పోయాలి. దోశ మాదిరిగా గరిటెతో తిప్పకుండా రవ్వ దోశ మాదిరిగా వేసి నూనె వేస్తూ రెండు వైపులా కాల్చి తీయాలి.
మూలం : ఈనాడు ఆదివారం పుస్తకం