మినప్పప్పు - అరకప్పు;
బార్లీ - అరకప్పు
బియ్యం - కప్పు;
పెసరపప్పు - 2 టేబుల్ స్పూన్లు
శనగపప్పు, సోయాబీన్స్ - అర కప్పు చొప్పున
నానబెట్టిన మెంతులు - టేబుల్ స్పూను
అటుకులు - పావుకప్పు;
జీలకర్ర - 2 టీ స్పూన్లు
ఉప్పు - తగినంత;
చీజ్ తురుము - 50 గ్రా.
కొత్తిమీర - చిన్న కట్ట;
నూనె - కొద్దిగా
క్యారట్ తురుము - 4 టేబుల్ స్పూన్లు
పచ్చిమిర్చి తరుగు - టీ స్పూను;
ఉల్లితరుగు - పావు కప్పు
తయారి:
- అన్నిరకాల పప్పులు, బియ్యం, బార్లీ, సోయాబీన్స్‌ని ఆరు గంటలసేపు నానబెట్టాలి.
- నీరు వడకట్టి, మిక్సీలో వేసి మెత్తగా చేసి పక్కన ఉంచుకోవాలి.
- తగినంత నీటిలో అటుకులను పావుగంట సేపు నానబెట్టి, మిక్సీలో వేసి మెత్తగా చేయాలి.
- రుబ్బి ఉంచుకున్న పిండి మిశ్రమంలో అటుకుల పిండి కలిపి మూడు నాలుగు గంటలు పక్కన ఉంచాలి. జీలకర్ర వేసి కలపాలి.
- స్టౌ మీద పెనం పెట్టి, వేడయ్యాక పిండిని దోసెలా వేసి, పిండి పచ్చిగా ఉండగానే, పైన క్యారట్ తురుము, ఉల్లి తరుగు, పచ్చిమిర్చి తరుగు కొద్దికొద్దిగా వేసి బాగా కాలాక రెండవవైపు తిప్పి కాల్చి తీసేయాలి.
మూలం : సాక్షి దినపత్రిక