మినపప్పు : రెండు కప్పులు
బియ్యం : రెండు కప్పులు
ఉడకబెట్టిన బంగాళాదుంప గుజ్జు : మూడు కప్పులు
కొబ్బరి కోరు : అరకప్పు
ఉల్లిపాయ ముక్కలు : రెండు కప్పులు (సన్నగా తరిగి పెట్టుకోవాలి )
ఉడికించిన బటాణి : అరకప్పు
పచ్చి మిర్చి ముక్కలు : ఒక చెంచాడు
అల్లం వెల్లుల్లి పేస్ట్ : కొద్దిగా
ఆలివ్ నూనె : మూడు స్పూన్లు
ఆవాల పొడి : ఒక స్పూన్
జీలకర్ర పొడి : కొద్దిగా
ఇంగువ : కొద్దిగా
పాలకూర : కొద్దిగా
కొత్తిమీర : కొద్దిగా
ఉప్పు : తగినంత
తయారుచేసే పద్ధతి :
మినపప్పు, బియ్యాలను నానబెట్టి రుబ్బుకున్న తర్వాత ఉడకబెట్టిన బంగాళాదుంపల గుజ్జు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఉడికించిన బటానీలు, తాజా కొబ్బరి కోరు, పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆలివ్ ఆయిల్, ఆవాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ఇంగువ, పాలకూర, కొత్తిమీరల తరుగు, తగినంత ఉప్పు బాగా కలిపి దోశలుగా వేసుకుంటే సరి ... ఘుమఘుమలాడే మైసూర్ మసాలా దోశలు ప్లేట్ లో నోరూరిస్తాయి.
మూలం : ఆదివారం ఆంధ్రప్రభ