సేమియా - ఒక కప్పు
పెరుగు - 2 కప్పులు
పచ్చిమిర్చి - 3
మిరియాల పొడి - కొద్దిగా
కరివేపాకు - రెండు రెమ్మలు
కొత్తిమీర - కొద్దిగా
ఆవాలు - అర టీస్పూన్
ఎండు మిర్చి - 4
నెయ్యి - ఒక టీస్పూన్
ఉప్పు - తగినంత
తయారుచేసే పద్ధతి :
ఒక పాత్రలో మూడు కప్పుల నీళ్ళు పోసి మరిగించాలి. దాంట్లో సేమియా వేసి బాగా ఉడికించి దించాలి. నీటిని వడకట్టి, సేమ్యాను చన్నీళ్ళలో వేసి ఫైఫైన కదిపి నీళ్ళలో నుంచి తియ్యాలి. బాణలిలో నెయ్యి వేసి కాగాక ఆవాలు, ఎండుమిర్చి, మిరియాల పొడి, పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు వేసి బాగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో పెరుగు వేసి అందులో ఉడికించిన సేమియా, వేయించి ఉంచుకున్న పోపు, ఉప్పు వేసి కలపాలి. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి.
మూలం : సాక్షి దినపత్రిక