సేమియా - ఒక కప్పు
పచ్చిమిర్చి - 3
పల్లీలు - రెండు చెంచాలు
పచ్చి శనగపప్పు - రెండు చెంచాలు
మినపప్పు - చెంచాడు
ఆవాలు - చెంచాడు
జీలకర్ర - చెంచాడు
కర్వేపాకు - రెండు రెమ్మలు
ఎండు మిర్చి - 3
అల్లం - చిన్న ముక్క
ఉల్లిగడ్డలు - 2
నూనె - సరిపడా
ఉప్పు - తగినంత
తయారుచేసే పద్ధతి :
మూకుట్లో నూనె వేసి వేడయ్యాక పచ్చి శనగపప్పు, పల్లీలు, పోపు గింజలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. కరివేపాకును చిటపట లాడించి ఒక కప్పు సేమియాకు రెండు కప్పుల చొప్పున నీళ్ళు పోసి మరిగించాలి. తర్వాత సేమియాతో పాటు ఉప్పు వేసి ఉడికించాలి. అది గట్టిపడే దాక స్టవ్ మీదే ఉంచి తర్వాత దించుకుంటే సరి. కమ్మని 'సేమియా ఉప్మా' రెడీ...
మూలం : నమస్తే తెలంగాణ ఆదివారం పుస్తకం