లవంగాలు, దాల్చినచెక్క, యాలకులు, శొంటి కొద్ది కొద్దిగా తీసుకొని పొడి చేసి డబ్బాలో వేసి పెట్టుకోండి. టీ చేసేటపుడు టీ పొడితో పాటు ఈ మసాలా పొడి కొద్దిగా వేసి మరిగించండి. తర్వాత పాలు, చక్కర కలపాలి. ఇది మంచి ఘాటు అయిన సువాసన ఇస్తుంది. ఈ మసాలా దినుసులన్నీ వేసి డికాక్షన్ బాగా మరిగించినందున ఆ దినుసుల్లోని రసాయనాలు టీ లో చేరతాయి.దాల్చినచెక్క రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. జీర్ణక్రియ మెరుగవుతుంది. అంటు వ్యాదులనుండి కాపాడుతుంది.