ఓట్స్ - కప్పు
గోధుమ పిండి - అరకప్పు
బియ్యప్పిండి - అరకప్పు
క్యారెట్ తురుము - అరకప్పు
ధనియాల పొడి - టీస్పూన్
జీలకర్ర పొడి - టీస్పూన్
కసూరి మెంతి - టీస్పూన్
కరివేపాకు - పది రెమ్మలు
గరం మసాలా - టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
జీలకర్ర - టీస్పూన్
నూనె - వేయించడానికి సరిపడా
కారం - 2 టీస్పూన్లు
పసుపు - అర టీస్పూన్
వాము - అరటీస్పూన్
తయారుచేసే పద్ధతి:
- ఓ గిన్నెలో అన్నీ వేసి కలపాలి. తరువాత తగినన్నీ నీళ్ళు పోసి గట్టి పిండిలా కలపాలి. ఇప్పుడు చిన్న ముద్దను తీసుకోవాలి. పెనం మీద ఓ టీస్పూన్ నూనె వేసి ముద్దను ఉంచి వేళ్ళతో నెమ్మదిగా వత్తుతూ చిన్న రొట్టెలా చేయాలి. మధ్యమధ్యలో చేతుల్ని తడి చేసుకోవాలి. మధ్యలో చిన్న రంద్రం చేయాలి. అందులో కూడా ఓ టీస్పూన్ నూనె వేయాలి. ఇప్పుడు మొత్తం అన్ని వైపులకు నూనె వెళ్లి బాగా కాలుతుంది. ఇలా రెండు వైపులా కాల్చి తీయాలి.
మూలం : ఈనాడు ఆదివారం పుస్తకం